గంజాయి వ్యాపారులపై దాడులు చేస్తారా? చంద్రబాబు ఆగ్రహం

Webdunia
శనివారం, 21 మే 2022 (11:51 IST)
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి అమ్మేవారిపై దాడులు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కాదు... టంగ్ స్లిప్ కావడంతో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 
 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయన టీడీపీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయికి ఎక్కువ మంది బానిసలవుతున్నారన్నారు. గుంటూరులో యువకులు గంజాయి మత్తులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి మత్తు పదార్థాల నుంచి యువతను కాపాడుకోవాలన్నారు. 
 
మరోవైపు, ఇక పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నానని.. ప్రధానంగా 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తానని.. కొత్తగా వచ్చేవారికి అవకాశమిస్తానన్నారు. తన వయసు 72 ఏళ్లయినా మీకోసం 27 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తానని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments