తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీమంత్రి పరిటాల రవి హత్య నిందితులను శిక్షించి ఉంటే.. వైఎస్ వివేకా హత్య జరిగి ఉండేది కాదన్నారు.
ప్రజలు ఆలోచించాలి రాష్ట్రాన్ని కాపాడుకుంటారా.. మరో శ్రీలంక చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చింది నీ కేసుల కోసమా జగన్? అని ప్రశ్నించారు. కోడి కత్తి కేసులో జగన్ తేలుకుట్టిన దొంగలా ఉన్నారని చంద్రబాబు తప్పుబట్టారు.
"ఎంత గొప్పవాడవయ్యా జగన్.. గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చావు. నారాసుర రక్తచరిత్ర అంటూ నేను చంపానని నా దగ్గరే కత్తి పెడతారు. దోషులను కాపాడుకోవడానికి నిరంతరం పనిచేస్తున్నారు. బాంబులు వేసి చంపుతామని సీబీఐ అధికారులనే బెదిరిస్తున్నారు. వైసీపీ బెదిరింపులను సీబీఐ గుర్తుపెట్టుకోవాలి'' అని బాబు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి కల్పించామని.. వైకాపా పాలనల్లో పరిశ్రమల్లేవని చంద్రబాబు అన్నారు.
వైకాపా నేతల రౌడీయిజం చూసి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయి. కొత్త ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ బాబు అసహనం వ్యక్తం చేశారు.