Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా: జిన్‌పింగ్‌ సన్నిహితుడు ‘లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేశారు’ - చైనా టెన్నిస్ స్టార్ ఆరోపణ

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (19:52 IST)
ఓ రిటైర్డ్ కమ్యూనిస్ట్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షుయ్ బహిరంగంగా ఆరోపించారు. మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గోలీ తనను ఆయనతో లైంగిక సంబంధం పెట్టుకోమని 'బలవంతం' చేశారని చైనీస్ సోషల్ మీడియా సైట్ వీబోలో పెంగ్ పోస్ట్‌ చేశారు.

 
చైనాకు చెందిన సీనియర్ రాజకీయ నేతపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. జాంగ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించలేదు. పెంగ్ పోస్టును ఇంటర్నెట్ నుంచి తొలగించారు. టెన్నిస్ డబుల్స్‌లో ఒకప్పటి నంబర్​వన్ ర్యాంకర్‌ అయిన పెంగ్ గురించి అంతర్జాలంలో శోధించే అవకాశాన్ని సైతం పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

 
2013 నుంచి 2018 మధ్య చైనా వైస్ ప్రీమియర్‌గా జాంగ్(75) పని చేశారు. ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. "వైస్ ప్రీమియర్ జాంగ్ గోలీని చూస్తే మీకు భయం వేయడం లేదా అని అడుగుతారని నాకు తెలుసు" అని పెంగ్ తన పోస్ట్‌లో రాశారు. "ఒక భారీ రాయిని గులకరాయి ఢీకొడుతుంది అనుకోండి.. లేదంటే, చిన్న పురుగు అగ్నికీలలపై దాడికి వెళ్లి తనను తాను ఆహుతి చేసుకుంటోందనైనా అనుకోండి. కానీ, నేను మాత్రం ఆయన గురించి నిజమే చెబుతాను" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

 
టెన్నిస్ ఆడేందుకు ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత జాంగ్ తొలిసారిగా తనను బలవంతం చేశాడని చెప్పారు. "ఆ మధ్యాహ్నం నేను అందుకు అంగీకరించలేదు. ఏడుపు ఆపుకోలేకపోయాను. మీరే నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లి బలవంతం చేశారు" అని ఆమె రాసుకొచ్చారు. తన వాదనలను రుజువు చేయడానికి తగిన ఆధారాలను అందించలేనని పెంగ్(35) పేర్కొన్నారు.

 
"నా దగ్గర ఆధారాలు లేవు. సాక్ష్యాలను సంపాదించడం అసాధ్యం. నేను సాక్ష్యాలను రికార్డ్ చేయడానికి టేప్ రికార్డర్ లాంటివి లేదా మరేదైనా తీసుకువస్తానని ఆయన ఎప్పుడూ భయపడేవారు. నా దగ్గర ఆడియో రికార్డు లేదు. వీడియో రికార్డు లేదు. నా నిజమైన అనుభవం మాత్రమే ఉంది". చైనాలో వెలువడుతున్న హై ప్రొఫైల్ మీటూ కేసుల శ్రేణిలో పెంగ్ సోషల్ మీడియా పోస్టు తాజా పరిణామం. 2018లో ప్రముఖ టీవీ హోస్ట్ ఝౌ జియావోగ్జువాన్, మరో టీవీ ప్రముఖులు జు జున్​ గురించి ఆన్​లైన్ వ్యాసంలో తన వాదనను రాసుకొచ్చారు.

 
ఆ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైంగిక వేధింపులకు గురైన వారు, వారి అనుభవాలను బయటపెట్టేందుకు చాలా మందికి ప్రేరణనిచ్చింది. అయితే జు జున్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఝౌ గ్జియావోగ్జువాన్, జు జున్‌పై చట్టపరమైన చర్యలకు వెళ్లారు. అయితే ఈ కేసును సెప్టెంబర్‌లో కోర్టు కొట్టేసింది.

 
చైనీస్ కోర్టులు ఇలాంటి కేసులను అరుదుగా విచారణకు స్వీకరిస్తాయి. లైంగిక వేధింపులను స్పష్టంగా నిర్వచించే చట్టాన్ని దేశం ఇటీవల ఆమోదించింది. తన టెన్నిస్ కెరీర్‌లో, పెంగ్ రెండు గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్ ట్రోఫీలను గెలుచుకుంది. మొదటిది 2013లో వింబుల్డన్‌లో, రెండోది 2014లో జరిగిన రోలాండ్ గారోస్ టోర్నమెంట్‌లో. ఈ రెండూ ట్రోఫీలను తైవాన్‌కు చెందిన హ్సీహ్ సు-వీతో కలిసి ఆమె గెలుచుకున్నారు.
 
ఇంటర్నెట్‌పై ఆంక్షలు
చైనా మీడియా విశ్లేషకులు కెర్రీ అలెన్
పెంగ్ ఒక పెద్ద స్టార్. చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్ బైదులో ఆమె పేరును వెతికితే, 70 లక్షల కంటే ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి. కానీ, ప్రజలు ఆమె గురించి మాట్లాడకుండా ఉండటానికి చైనాలో ప్రముఖ సినా వీబో మైక్రోబ్లాగ్(ఫేస్‌బుక్‌తో సమానమైన మైక్రో బ్లాగ్‌)పై భారీ ఆంక్షలు విధించారు.

 
ఆమె పేరును శోధిస్తే కేవలం 700 ఫలితాలు మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు. ఐదు లక్షల మందికిపైగా ఫాలోయర్లు ఉన్న పెంగ్ ఖాతా గురించి వెతికితే ఎలాంటి ఫలితాలను చూపడం లేదు. సాధారణ సోషల్ మీడియా వినియోగదారులు చేసే కామెంట్లను వీబో వినియోగదారులు చూడలేరు. ధ్రువీకరించిన ప్రభుత్వ మీడియా ఖాతాల ద్వారా చేసిన పోస్టులను మాత్రమే వీబోలో వెతికితే వచ్చే ఫలితాల్లో కనిపిస్తాయి. చైనాలో "టెన్నిస్" అనే పదంతో వెతికితే కేవలం ధ్రువీకరించిన ఫలితాలు మాత్రమే కనిపిస్తాయి. సాధారణ వినియోగదారులు చేసిన పోస్టులను, తన వినియోగదారులకు వీబో చూపదు.

 
ఒక అంశం సున్నితమైనది అయినప్పుడు శోధన ఫలితాలపై సాధారణంగానే ఆంక్షలు విధిస్తారు. చారిత్రకంగా, సున్నితమైన పదాలను పూర్తిగా సెన్సార్ చేయడంతో, సెన్సార్‌షిప్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చైనా అగ్ర నాయకత్వానికి చెందిన పేర్లు సినా విబోలో చాలాకాలంగా సున్నితమైన పదాలుగా ఉన్నాయి. చైనా పొలిట్‌బ్యూరోపై సాధారణ వినియోగదారులు చేసిన వ్యాఖ్యలను, వీబో వినియోగదారులు శోధించలేకపోయారు. అధికారిక మీడియా పోస్టులను మాత్రమే చూడగలిగారు.

 
అయినప్పటికీ, సోషల్ మీడియా వినియోగదారులు తమ గొంతుకను వినిపించడానికి పరిష్కారాలను చాలా కాలంగా కనుగొంటూ వస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మరొక టెన్నిస్ ప్లేయర్ జాంగ్ షుయ్ గురించి ప్రస్తావిస్తున్నట్టు పోస్టులు పెడుతూ, పెంగ్ షుయ్ గురించి కామెంట్లు పెడుతున్నారు. వినియోగదారులు ‘మీ టూ’ ఉద్యమం గురించి మాట్లాడటానికి "రైస్‌", "ర్యాబిట్‌" అనే పదాలను వినియోగించిన చరిత్ర కూడా ఉంది. రైస్‌, ర్యాబిట్‌ అనే పదాలను చైనీస్‌లో "మీ టూ" అని పలుకుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం