Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతనా రాజ్: బరువు తగ్గించుకునే శస్త్రచికిత్స తరువాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?

Webdunia
బుధవారం, 18 మే 2022 (16:49 IST)
కన్నడ టీవీ నటి చేతనా రాజ్ బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆమె బరువు తగ్గించుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. గత సోమవారం ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత ఆమె ఊపిరితిత్తుల్లోకి నీరు చేరింది. ఫలితంగా ఆమె ఆరోగ్యం దెబ్బతింది.

 
‘‘ఆమెను ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేం కేసును దర్యాప్తు చేపడుతున్నాం’’అని బెంగళూరు పోలీస్ (ఉత్తర విభాగం) డిప్యూటీ కమిషనర్ అవినాశ్ పాటిల్ బీబీసీతో చెప్పారు. ‘‘ఫిర్యాదులో వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు వారు ఆరోపించారు. దీంతో సీఆర్‌పీసీలోని సెక్షన్ 174 కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపడుతున్నాం’’అని ఆయన వివరించారు.

 
అసలేం జరిగింది?
‘‘గీత’’, ‘‘దొరస్వామి’’లాంటి సీరియల్స్‌లో నటించి చేతన గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట చేతనా రాజ్ పరిస్థితి గురించి ఒక వైద్యుడు పోలీసులకు సమాచారం అందించారు. ‘‘ఒక అనష్తీషియా నిపుణుడు అపస్మారక స్థితిలోనున్న చేతనను మా ఆసుపత్రికి తీసుకొచ్చారు’’అని ఆ వైద్యుడు పోలీసులతో చెప్పారు.

 
‘‘ఆమెకు గుండెపోటు వచ్చిందని మాత్రమే ఆ అనష్తీషియా నిపుణుడు చెప్పారు. వెంటనే మేం ఆమెకు వైద్యం అందించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఆమె మరణించారు’’అని ఒక డాక్టర్ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, చేతనా గత సోమవారం బరువును తగ్గించుకునేందుకు లైపోసక్షన్ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.

 
లైపోసక్షన్ అంటే ఏమిటి?
ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు లేదా శరీరంలో పేరుకున్న కొవ్వును తొలగించుకునేందుకు లైపోసక్షన్ శస్త్రచికిత్సను ఆశ్రయిస్తుంటారు. ఈ శస్త్రచికిత్సతో దుష్ప్రభావాలు కూడా ఉంటాయని ఎప్పటికప్పుడే వైద్యులు హెచ్చరిస్తుంటారు. లైపోసక్షన్ వల్ల కొవ్వు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ముప్పు ఉంటుంది.

 
ఈ శస్త్రచికిత్సలో భాగంగా శరీరంలోని భిన్న భాగాల్లో పేరుకున్న కొవ్వును వైద్యులు తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కొవ్వు వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశంలేని తొడలు, కడుపు, పిరుదులు లాంటి శరీర భాగాల్లోని కొవ్వును శస్త్రచికిత్సతో తొలగిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ చికిత్సలు విఫలమై రోగి ప్రాణాలకే ముప్పు ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments