Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌ 2019 నామినీలను ప్రకటించిన బీబీసీ

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:49 IST)
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ నామినీల ఎంపిక కార్యక్రమం పూర్తయ్యింది. భారత్‌కు చెందిన ప్రముఖ క్రీడా పాత్రికేయులు, నిపుణులు, రచయితలు- వేర్వేరు క్రీడలకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులను నామినీలుగా ఎంపిక చేశారు. ఈ రోజు నుంచి ప్రజలు బీబీసీ తెలుగు వెబ్ సైట్‌కు వెళ్లి తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు.

 
నామినేట్ అయిన ఐదుగురు క్రీడాకారిణులు
ద్యుతి చంద్- అథ్లెటిక్స్
మానసి జోషి- పారా బ్యాడ్మింటన్
మేరీ కోమ్- బాక్సింగ్
వినేశ్ ఫోగట్- ఫ్రీస్టైల్ రెజ్లింగ్
పీవీ సింధు- బ్యాడ్మింటన్

 
“భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు ప్రపంచమంతా నీరాజనాలు పడుతున్న ఈ సందర్భంలో బీబీసీ అందిస్తున్న ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారం వారి ప్రతిభకు మరో గుర్తింపు కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులంతా తమకు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారిణికి ఓటు వేసి, ఐదుగురు నామీనీలలో విజేతను ఎంపిక చేస్తారు” అని బీబీసీ డైరెక్టర్ ఆఫ్ న్యూస్ ఫ్రాన్ అన్స్‌వర్త్ అన్నారు.

 
ఈ అవార్డ్ విజేతను బీబీసీ డైరెక్టర్ జనరల్ లార్డ్ టోనీ హాల్ 2020 మార్చి 8వ తేదీన దిల్లీలో వెల్లడించనున్నారు. అదే రోజు, భారతీయ మహిళా క్రీడారంగానికి విశేష కృషి చేసిన క్రీడాకారిణిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరిస్తారు.

 
నామినీలుగా ఎంపిక కావడంపై క్రీడాకారిణులు ఏమన్నారంటే...
ద్యుతి చంద్: “బీబీసీ నాపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ద్వారా నా గురించి, నా ఆట గురించి మరింత మందికి తెలుస్తుంది. భారత్‌లో తొలిసారిగా ప్రారంభిస్తున్న ఈ బీబీసీ స్పోర్ట్స్ అవార్డ్‌కు నామినేట్ కావడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది”.

 
మానసి జోషి: “నన్ను పారాఅథ్లెట్ విభాగంలో కాకుండా సాధారణ క్రీడాకారిణులతో సమానంగా ఈ అవార్డ్‌ కోసం నామినేట్ చెయ్యడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది”.

 
మేరీ కోమ్: “ఈ అవార్డ్ సాధించినా, సాధించకపోయినా నేను బాధపడను. కానీ, అర్హులైనవారికే ఈ పురస్కారం లభిస్తుందని కచ్చితంగా చెప్పగలను”.

 
వినేశ్ ఫోగట్: “ఇటీవల కాలంలో భారతీయ క్రీడాకారిణులు అద్భుతంగా రాణిస్తున్నారు. నా గురించి కూడా మాట్లాడుకోవడం నాకు ఎనలేని సంతృప్తినిస్తోంది. దీనర్థం నేనేదో గొప్ప పని చేస్తున్నట్లే”.

 
పీవీ సింధు: “నామినేట్ అవడం అంటే సాధారణ విషయం కాదు. ఇది ప్రతి అథ్లెట్‌కు, ఇతరులకు కూడా ప్రోత్సాహాన్నిస్తుంది. ఎందుకంటే, నామినేషన్లలో ఉండటం అంత సులభం కాదు”. 

 
ఓటింగ్‌ ఎలా:  బీబీసీ తెలుగు, బీబీసీ స్పోర్ట్, బీబీసీ తమిళ్, బీబీసీ మరాఠీ, బీబీసీ హిందీ, బీబీసీ పంజాబీ, బీబీసీ గుజరాతీ వెబ్‌సైట్లలో దేనికైనా వెళ్లి ఉచితంగా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే అన్నిరకాల క్రీడల్లో రాణిస్తున్న భారతీయ మహిళలు, పారాఅథ్లెట్లకు సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాలను చూడవచ్చు.

 
ప్రపంచవ్యాప్తంగా ఈ ఓటింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 17, 2020న 23.30 గంటలు (భారతీయ కాలమానం) లేదా 18.00 (జీఎంటీ) తో ముగుస్తుంది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీల ఎంపికలో భాగంగా భారత్‌లో క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యంపై ఆలోచనలు, దృక్పథాలు ఎలా ఉన్నాయి, లింగం పాత్ర, సమాజంలో మహిళల స్థానం ఏంటనే దానిపై విస్తృత అధ్యయనం నిర్వహించాం. 

 
ఈ వివరాలు మార్చి మొదటివారంలో అందుబాటులో ఉంచుతాం. 1951 నుంచి 2019 నవంబర్ వరకూ భారతీయ మహిళా క్రీడాకారుల ఆటతీరును మరో ప్రాజెక్టు నివేదిక మరింత లోతుగా విశ్లేషిస్తుంది. 1951 ఆసియా క్రీడల్లో మొదటి పతకం సాధించిన నాటి నుంచి అన్ని రకాల అంతర్జాతీయ క్రీడల్లో ధోరణులు ఎలా మారుతూ వచ్చాయో ఈ లోతైన నివేదికలు వివరిస్తాయి.

 
అత్యుత్తమ ప్రతిభ చూపిన భారతీయ మహిళా అథ్లెట్లను, క్రీడాకారులను గౌరవించే లక్ష్యంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అభిమానులకు స్ఫూర్తినిచ్చే వారి విజయాలను సంబరంగా చేసుకోవాలనుకుంటూ, కొత్త ఒరవడికి నాంది పలికుతూ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారాన్ని బీబీసీ ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments