Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Shirdi ఆలయం మూసివేత.. ప్రాముఖ్యం తగ్గిపోతుంది ప్లీజ్..ఆపండి.. (video)

Advertiesment
Shirdi
, శనివారం, 18 జనవరి 2020 (11:53 IST)
మహారాష్ట్రలో షిరిడీ సాయి జన్మభూమిపై సరికొత్త వివాదం నడుస్తోంది. సద్గురు సాయిబాబా జన్మస్థలంలో 1999లో అక్కడ శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరానికి కూడా భక్తులు పెద్ద మొత్తంలో ఆలయానికి వస్తుండటంతో ఇటీవల ఉద్ధవ్ సర్కార్ పత్రిలోని సాయిబాబా మందిర అభివృద్ధికి వంద కోట్ల రూపాయలను ప్రకటించింది. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. 
 
పత్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ప్రకటనపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ట్రస్ట్.. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం షిరిడీ గ్రామస్తులతో సమావేశం అవుతోంది. 
 
వాస్తవానికి పత్రి ఆలయం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు.. షిరిడీలో కొలువైన సాయిబాబాను దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలుస్తుంటారు. అయితే, షిరిడీతో సమానంగా పత్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయాన్ని షిరిడీ సాయిబాబా సంస్థాన్ తప్పుబడుతోంది. పత్రిని అభివృద్ధి చేస్తే షిరిడీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది. సీఎం ప్రకటనకు వ్యతిరేకంగా రేపు షిరిడీ బంద్‌కు పిలుపునిచ్చింది. 
 
అంతే కాదు, రేపటి నుంచి షిరిడీ సాయి ఆలయంలో అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ట్రస్ట్ నిర్ణయంతో ఆలయానికి వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది.  అటు ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతోంది. కొత్త సర్కార్ వచ్చిన తర్వాతే సాయి జన్మభూమి వివాదం తెరపైకి వచ్చిందని కమలనాథులు విమర్శిస్తున్నారు. షిరిడీ ప్రజలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముదురుతున్న సాయి జన్మభూమి వివాదం