Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘నా శరీరం కోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు’ :దిల్లీలో ఆఫ్రికా యువతులతో సెక్స్ కుంభకోణంపై బీబీసీ పరిశోధన

‘నా శరీరం కోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు’ :దిల్లీలో ఆఫ్రికా యువతులతో సెక్స్ కుంభకోణంపై బీబీసీ పరిశోధన
, సోమవారం, 16 డిశెంబరు 2019 (15:07 IST)
భారత్‌లో పనిచేస్తున్న ఆఫ్రికన్ పురుషుల సెక్స్ కోరికలు తీర్చేందుకు ఆఫ్రికా అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని బీబీసీ ఆఫ్రికా-ఐ పరిశోధనలో వెల్లడైంది. ఈ సెక్స్ ట్రాఫిక్ నెట్‌వర్క్ వెనుక ఎవరున్నారన్న విషయాన్ని కనుక్కునేందుకు బీబీసీ చేసిన రహస్య పరిశోధనలో ఊహించని విషయాలు వెలుగు చూశాయి.

 
కెన్యా యువతులు విలాస జీవితానికి కావాల్సిన డబ్బు కోసం పురుషులను ఆశ్రయిస్తున్న తీరుపై బీబీసీ ఆఫ్రికా-ఐ 2018లో పరిశోధన చేపట్టింది. దీనిలో భాగంగా బీబీసీ అప్పుడు గ్రేస్‌ను ఇంటర్వ్యూ చేసింది.

 
సిరీస్ ప్రసారమైన తర్వాత కూడా గ్రేస్ తన బిడ్డను పెంచడానికి చాలా కష్టపడ్డారు. ఆ సమయంలోనే ఆమె, "భారత్‌లో డ్యాన్సర్లుగా, పర్యాటక రంగంలో పనిచేసేందుకు కొందరు మహిళలు కావాలి'' అనే ఓ ప్రకటనను ఆమెకు వాట్సాప్‌ గ్రూపులో చూశారు.

 
''భారత్‌లో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారి కోసం వెతుకుతున్నట్లు వాట్సాప్ ప్రకటనలో చూశాను. అక్కడ డబ్బు బాగా వస్తుందని విన్నాను. అందుకే దిల్లీ వెళ్లాలని నిశ్చయించుకున్నాను''అని గ్రేస్.. బీబీసీకి చెప్పారు. భారత్‌కు వెళ్లాక... వ్యభిచార విషవలయంలో చిక్కుకున్నానని తీవ్ర నిరాశతో మెసేజ్‌లు పంపారు.

 
గ్రేసీ మెసేజ్‌లు చదివిన అనంతరం బీబీసీ ప్రతినిధి న్యాషా కదందర భారతదేశానికి వచ్చారు. దిల్లీలో గ్రేస్‌లా వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఆఫ్రికన్ యువతులు చాలా మంది ఉన్నారని ఆమెకు తొందర్లోనే అర్థమైంది. గ్రేస్‌ సాయంతో దిల్లీలో ఆఫ్రికన్ మహిళలతో సాగుతున్న అక్రమ సెక్స్ వ్యాపారం వివరాలు తెలుసుకున్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత హిందీ పాటకు డ్యాన్స్ చేసిన వృద్ధుడు.. సోషల్ మీడియాలో వైరల్