Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి మహిళలు ఆచరించదగ్గ ఆరోగ్య నియమాలు... (Video)

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (22:30 IST)
రోజూ తినే ఆహారంలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఇది కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
 
ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో పుష్కలంగా ఉంది. 
 
బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును తొలగిస్తుంది. కూరల్లో కలిపి తిన్నా, రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకుని తాగినా చ‌క్క‌ని ఫ‌లితాలు వ‌స్తాయి. 
 
వెల్లుల్లి‌లోని యాంటీ బ్యాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా క‌రిగిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.
 
వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. ఇత‌ర నూనెల‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
 
బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తినే వారిలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments