Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇత్తడి పాత్రల్లో భోజనం మంచిదా? బంగారు, వెండి పళ్లాల్లో అయితే?

ఆరోగ్యవంతంగా వుండేందుకు ఎలాంటి పాత్రల్లో భుజించాలన్నది ఆయుర్వేద శాస్త్రం వివరించింది. దీని ప్రకారం వివిధ పాత్రలలో భుజించేవారికి వివిధ రకాలైన ఫలితాలు చవిచూస్తారు. బంగారు పాత్రలలో భోజనం చేసేవారికి సకల దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెపుతోంది. ఇక వెండి పాత

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (19:52 IST)
ఆరోగ్యవంతంగా వుండేందుకు ఎలాంటి పాత్రల్లో భుజించాలన్నది ఆయుర్వేద శాస్త్రం వివరించింది. దీని ప్రకారం వివిధ పాత్రలలో భుజించేవారికి వివిధ రకాలైన ఫలితాలు చవిచూస్తారు. బంగారు పాత్రలలో భోజనం చేసేవారికి సకల దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెపుతోంది. ఇక వెండి పాత్రలో భోజనం చేసేవారికి నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. పిత్త వ్యాధులు దరిచేరవు. ఐతే కఫ, వాత వ్యాధులు ఉండేవారు ఈ వెండి పాత్రలలో భోజనం చేయకూడదు. 
 
ఇత్తడి పాత్రలలో భోజనం చేయడం వల్ల క్రిములు నశిస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది. కఫ వ్యాధులను ఇది నివారిస్తుంది. శోష, పాండు రోగాలను అరికట్టి శరీరానికి బలాన్ని చేకూర్చుతుంది. 
 
ఇకపోతే భోజనం చేసే ప్రతిసారీ కొద్దిగా అన్నంలో అల్లం, సైంధవ లవణము కలిపి తీసుకుంటే చాలా ఆరోగ్యం. అన్నము మీద ఉన్న అయిష్టతను, అరుచిని ఇవి పోగొడతాయి. నాలుక, కంఠాన్ని ఇవి శుద్ధి చేస్తాయి.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments