చికెన్, చేపలు తిన్న వెంటనే పాలు తాగుతున్నారా?
చికెన్ తిన్న వెంటనే పాలు తాగుతున్నారా? పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తీసుకోకూడదు. అలా చేస్తే జీర్ణ వ్యవ
చికెన్ తిన్న వెంటనే పాలు తాగుతున్నారా? పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తీసుకోకూడదు. అలా చేస్తే జీర్ణ వ్యవస్థపై అది ప్రభావం చూపుతుంది. పాలలో పూర్తిగా ప్రోటీన్లు వుంటాయి.
అలాగే అమినో యాసిడ్స్ పుష్కలంగా వుంటాయి. చికెన్‌లోనూ ప్రోటీన్ల శాతం అధికంగా వుంటుంది. అందుకే చికెన్ తీసుకున్న వెంటనే ప్రోటీన్లు అధికంగా వున్న పాలను తీసుకోకూడదు. రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉన్నందువల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.
ఒకవేళ చికెన్ తీసుకున్న తర్వాత పాలు తాగితే ఎసిడిటీ ఏర్పడే ప్రమాదం వుంది. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. అలాగే అరటి పండుతో పాటు కోడిగుడ్డు తీసుకోవడం కూడా చేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ప్రోటీన్లు వున్న ఆహారాలను ఒకే సమయంలో తీసుకోవడం ద్వారా హైబీపీ, హృద్రోగ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే పాలతో కలిపి చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటివి తీసుకోకూడదు.
ఇంకా మాంసాహారాల్లో నూనె అధికంగా వాడకూడదు. మితంగా వాడుకోవాలి. నూనె లేని తండూరి వంటి వంటకాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం తీసుకున్న 12 గంటల తర్వాతే పాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే మాంసాహారం పూర్తిగా జీర్ణమవుతుందని.. అలా కాకుండా వెంటనే తీసుకుంటే అలెర్జీలకు కూడా దారితీసే ఛాన్సుందని వారు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇలాగే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణ రసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్‌లో వంటకాలను తీసుకోకూడదు. ఇక పుచ్చకాయ తీసుకున్న వెంటనే నీటిని సేవించకూడదు. పుచ్చలో 90 శాతం మేర నీరే వుంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే.. శరీరంలోని జీర్ణ రసాలపై దుష్ప్రభావం చూపుతుంది.
ఇకపోతే.. టీ, పెరుగు రెండింటిని ఒకేసారి తీసుకోకూడదు. ఈ రెండింటిలోనూ యాసిడ్స్ వుండటం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతోంది పాలు అరటి పండును కూడా ఒకేసారి తీసుకోకూడదని, ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.