Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తమా, దీర్ఘకాలిక జ్వరాలు తగ్గేందుకు ఇలా చేస్తే చాలు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (22:20 IST)
ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధులకు చక్కటి చిట్కాలు వున్నాయి. ఆస్తమా, దీర్ఘకాలిక జ్వరాలు, గ్యాస్ ట్రబుల్ తగ్గేందుకు ఏం చేయాలో చూద్దాం.
 
ఆస్తమా
పిప్పళ్లపొడి, తెల్లజిల్లేడు పూలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని తగినంత అన్నం వార్చిన గంజితో మెత్తగా నూరి, శనగలంత మాత్రలు చేసి ఆరించి ఉంచుకుని వ్యాధి తీవ్రతను బట్టి రోజుకి 1 లేదా 2 సార్లు ఒక మాత్ర చొప్పున మింగి తగినన్ని గోరువెచ్చని నీళ్లు సేవిస్తుంటే ఆస్తమా వ్యాధి చక్కగా నియంత్రణలోకి వచ్చేస్తుంది.
 
దీర్ఘకాలిక జ్వరాలకు...
50 గ్రాముల పిప్పళ్ల చూర్ణాన్ని 100 గ్రాముల బెల్లంతో కలిపి మెత్తగా దంచి నిలువ వుంచుకుని రోజూ ఉదయం, సాయంత్రం పూటకి 1 లేదా 2 గ్రాముల ఔషధాన్ని సేవించి ఒక కప్పు గోరువెచ్చని పాలు సేవిస్తూ వుంటే చక్కటి ఫలితం కనబడుతుంది.
 
గ్యాస్ ట్రబుల్ తగ్గేందుకు...
పిప్పళ్లు, శొంఠి, మిరియాలు, జీలకర్రను వేయించి చేసిన పొడులను ఒక్కొక్కటి 25 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు కలిపి వుంచుకుని రోజూ ఉదయం ఆహారానికి అర్థగంట ముందు 100 మి.లీ.ల వేడి నీటిలో 1 లేదా 2 గ్రాముల పొడి, అరబద్ధ నిమ్మరసం కలిపి సేవిస్తుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, అరుచిలాంటి సమస్యలకు మంచి ఫలితం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments