Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనస వేరును బాగా ఉడికించి ఆ రసాన్ని తాగితే? (video)

Advertiesment
పనస వేరును బాగా ఉడికించి ఆ రసాన్ని తాగితే? (video)
, శనివారం, 13 జూన్ 2020 (22:31 IST)
ఎంతోమందికి ఇష్టమైన పనస పండు‌లో పోషకాహారాలు పుష్కలంగా ఉన్నాయి. ఖనిజాలు, ఫైబర్ దీనిలో అత్యధికం. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అయితే దీనిని మితంగా తినడం మంచిది. అప్పుడే తగిన ఫలితాలు ఉంటాయి. విటమిన్లు, లవణాలు తక్కువగా ఉన్నందున పెద్దవారికి త్వరగా జీర్ణం కాదు.
 
పిల్లలలో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారు దీనిని బాగా తినవచ్చు. ఈ పండులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉన్నందున జీర్ణ సమస్యలు, అల్సర్లు తగ్గుతాయి. దీనిలో క్యాన్సర్‌ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు ఉన్నాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. జ్వరం, అతిసార ఉన్నవారికి మంచి మందుగా పనిచేస్తుంది. ఆస్తమాని తగ్గించుకోవాలంటే పనస వేరును బాగా ఉడికించి దాని నుండి వచ్చిన రసాన్ని తరచుగా త్రాగాలి.
 
ఇందులో స్వల్పంగా విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వయసు మీద పడటం వల్ల చర్మంలో త్వరగా మార్పులు రాకుండా కాపాడుతుంది. ఎముకల బలానికి కూడా తోడ్పడుతుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్త హీనతతో బాధపడేవారు, కంటి సమస్యలు ఉన్నవారు దీనిని బాగా తినాలి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీరంలో నల్లటి వలయాలు పోవాలంటే..?