Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీటిలో దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే...

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (16:46 IST)
దాల్చిన చెక్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాంసాహార వంటకాల్లో విధిగా ఉపయోగించేది. మసాలా రుచికోసం దీన్న ఉపయోగిస్తారు. దీనివల్ల కూరకు చక్కని రుచి, వాసన వస్తుంది. చిన్నిమామం అనే చెట్టుబెరడు నుంచి దీని తీస్తారు. అలాంటి దాల్చిన చెక్క కేవలం మాంసాహార వంటకాల్లో రుచి కోసమేకాకుండా అనేక రోగాల ఆయుర్వేద నివారణికిగా కూడా పని చేస్తుంది. ముఖ్యంగా మహిళల అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుంది. 
 
* అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది.
* బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చి చెక్క పొడిని కలిపి తాగినట్టయితే మహిళలను అధికంగా వేధించే రుతుస్రావ సమస్య ఇట్టే సమసిపోతుంది. 
* ఓ గ్లాసు పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగినట్టయితే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. 
 
* దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి.
* కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు.
* 10 గ్రాముల దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్‌ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే విపరీతమైన కడుపునొప్పితో బాధపడే వారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
* మొటిమలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రాసుకుంటే తగ్గుముఖం పడతాయి.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments