తృణధాన్యాలు చాల చిన్నవిగా ఉంటాయి. అంతమాత్రాన చిన్నచూపు చూడాల్సిన అక్కర్లేదు. నిజానికి ఈ చిన్న ధాన్యాల్లోనే ఎన్నో పోషకాలు దాగివున్నాయి. వీటిని ఆరగించడం వల్ల ఎన్నెన్నో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	సాధారణంగా బియ్యంలో మాంసకృతులు కేవలం 6-7 గ్రాములు మాత్రమే ఉంటాయి. కొవ్వు చాలా తక్కువగానే ఉంటుంది. అదే జొన్నలు, కొర్రల్లో మాత్రం మాంసకృతుల మోతాదు అధికం. బియ్యం, చిరు ధాన్యాలు రెండింటిలోనూ పిండి పదార్థం ఒకే మోతాదులో ఉన్నా బియ్యంలోని పిండిపదార్థం త్వరగా జీర్ణమైపోతుంది. ఇందులో పీచు పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. 
	 
	అదే చిరు ధాన్యాల్లోని పిండి పదార్థం నిదానంగా జీర్ణమవుతుంది. పైగా బియ్యం పిండిపదార్థంతో పోల్చితే ఇది మంచిది. నిదానంగా జీర్ణమవుతుంది. వీటిలో అధిక పీచు పదార్థం ఉంటుంది. చిరు ధాన్యాల అన్నం కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
	 
	చిరుధాన్యాల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల బియ్యంతో పోలిస్తే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి వీటిల్లోని గ్లూకోజు కూడా రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. వరి అన్నం తింటే గంటలోపే రక్తంలో గ్లూకోజు మోతాదులు పైస్థాయికి చేరుకుంటాయి. కానీ చిరుధాన్యాల్లో ఇలాంటి సమస్య ఉండదు. కాబట్టి మధుమేహులకు ఇవి బాగా ఉపయోగపడతాయి.