Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యపురిలో రామమందిరం.. తొలి ఇటుక వేసిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (13:07 IST)
అయోధ్యపురిలో రామాలయం కొలువు తీరాలన్న కోట్లాది హిందువుల కల నెరవేరనుంది. బృహత్తర ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం అట్టహాసంగా జరిగింది. 
 
అయోధ్యలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యలు తీసుకుంటూనే.. ముందుజాగ్రత్త చర్యగా అతిథుల జాబితాను ఆలయ నిర్మాణ ట్రస్టు కుదించి వేసింది. సంఘ్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, ఆయన సహచరులు తరలిరానుండగా.. రామజన్మభూమి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన బీజేపీ అగ్రనేతలు ఎల్కేఅద్వానీ, సీనియర్ నేత మురళీ మనోహర్‌ జోషీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కాగా, అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరిగిన భూమిపూజలో జై శ్రీరామ్ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని పంపినట్లు వారు చెప్పారు. 1989లో రామ మందిరం నిర్మాణం కోసం సుమారు 2.75 లక్షల ఇటుకలను రామ భక్తులు అయోధ్యకు పంపినట్లు వివరించారు. ఇందులో జై శ్రీరామ్ పేరు ఉన్న వంద ఇటుకలను భూమిపూజ, అనంతర నిర్మాణ పనుల కోసం వినియోగిస్తారని పూజారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments