Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (13:02 IST)
అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భూమి పూజ చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మొదటి ఇటుకను ఆయన వేయనున్నారు.
 
బుధవారం అయోధ్యలో జరిగే రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అథితిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని ఫొటోగ్రాఫర్ మహేంద్ర త్రిపాఠి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. 
29 యేళ్ల క్రితం అంటే 1991లో రామ్‌లల్లా జన్మోత్సవ కార్యక్రమం సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషితో కలిసి మోడీ అయోధ్యలో పర్యటించారని ఆయన గుర్తుచేశారు. తాను ఆ సమయంలో వీహెచ్‌పీ కోసం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తుండేవాడినని, అక్కడ కొంతమంది జర్నలిస్టులు కూడా తనతో ఉన్నారన్నారు.
మోడీని బీజేపీ గుజరాత్‌ నాయకుడిగా విలేకరులకు మురళీ మనోహర్ జోషి పరిచయం చేశారని చెప్పారు. తనతో పాటు మరికొంత మంది జర్నలిస్టులు మోడీని అయోధ్యకు తిరిగి ఎప్పుడు వస్తారని అడిగారని చెప్పాడు. 
దీనిపై మోడీ స్పందిస్తూ, రామ్ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడే తిరిగి తాను అయోధ్యకు వస్తానని చెప్పారని వివరించారు. అప్పట్లో మోడీ తాను ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారని ఆయన అన్నాడు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments