Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

రామన్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (22:30 IST)
Aquarius
కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
 
ఆదాయం 8 
వ్యయం: 14
రాజపూజ్యం: 7 
అవమానం 5
 
ఈ రాశివారికి గురుప్రభావం వల్ల గతం కంటే మరింత శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయమార్గాలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. కొత్త రుణాల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. 
 
ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. ఎవరి సాయం ఆశించవద్దు. మీ ఓర్పు, పట్టుదలే విజయానికి దోహదపడతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. 
 
విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. సంతానానికి శుభయోగం. వేడుకలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. పలుకబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. 
 
విద్యార్థులకు పోటీపరీక్షల్లో "ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ర్యాంకుల సాధనకు అకుంఠిత దీక్షతో శ్రమించండి. మీ కృషి తప్పక ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో కూడిన బదిలీ. ఉన్నతాధికారులకు అప్రాధాన్యతా రంగాలకు మార్పు. కళ, క్రీడాపోటీల్లో రాణిస్తారు. పుణ్యక్షేత్రాలు, విదేశాలు సందర్శిస్తారు. తోటి ప్రయాణికులతో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశివారికి శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం, అమ్మవారికి కుంకుమార్చనలు శుభం, జయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

లేటెస్ట్

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments