Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2025 వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు.. ఆదాయం 2, వ్యయం 14

Advertiesment
Scorpio Zodiac

రామన్

, గురువారం, 12 డిశెంబరు 2024 (12:42 IST)
Scorpio Zodiac
వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
 
ఆదాయం: 2 
వ్యయం 14
రాజపూజ్యం: 5
అవమానం: 2
 
ధనపంచమాధిపతి, గురు సంచార ప్రభావం చేత ఈ రాశివారికి ఈ సంత్సరమంతా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యవహారాల్లో అపజయం, ధన నష్టం వంటి ఫలితాలున్నాయి. ఆదాయం సామాన్యం. ఖర్చులు అదుపులో ఉండవు. సంపాదన మంచినీళ్లవలే ఖర్చవుతుంది. 
 
గృహావసరాలకు రుణాలు చేయవలసి వస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. అవివాహితులకు వివాహయోగం, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య తరచు కలహాలు, బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. 
 
ఆత్మీయుల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలస్యంగానైనా లక్ష్యాలను సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. 
 
తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. నోటీసులు అందుకుంటారు. సోదరీ సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. అందరితోను మితంగా సంభాషించండి. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
తరచు శుభకార్యాలు, పుణ్యకార్యాలకు హాజరవుతారు. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఫలసాయం సంతృప్తినిస్తుంది. 
 
ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, విదేశాలు సందర్శిస్తారు. ఈ రాశివారికి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన, శివాభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం శుభదాయకం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులారాశి 2025 రాశిఫలితాలు.. వరసిద్ధి వినాయకుని ఆరాధన చేస్తే?