Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-02-2025 నుంచి 01-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

రామన్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (08:37 IST)
మేషం: : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ నమ్మకం ఫలిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆదివారం నాడు కొత్తవారితో మితంగా సంభాషించండి. విమర్శలు, వ్యాఖ్యలకు స్పందించవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాల్లో గణనీయమైన లాభాలు గడిస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ముఖ్యులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సర్వత్రా అనుకూలమే. వాక్పటిమతో రాణిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. రావలసిన ధనాన్ని చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ కష్టపెట్టవద్దు. ఖర్చులు విపరీతం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. అందరితోను సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సోమవారం నాడు ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అరమరికలు తగవు. ప్రతి విషయాన్నీ ఇరువురూ కలిసి చర్చించుకోవాలి. మీ శ్రీమతి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. సంస్థల స్థాపనకు అనుకూలం. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. మీ అయిష్టతను సున్నితంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. భాగస్వామికంగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఉన్నత పదోన్నతి. నిర్మాణాలు ముగింపు దశకు చేరుకుంటాయి. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా లోటు లేకున్నా వెలితిగా ఉంటుంది. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ప్రతికూలతలు నిదానంగా సర్దుకుంటాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో శ్రమిస్తారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. గురువారం నాడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆప్తుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు ఉంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. హోల్ సేల్ వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. అతిగా శ్రమించవద్దు. కీలక అందుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. అకౌంటెంట్లకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులందుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. అందరితోను కలుపుగోలుగా మాట్లాడుతారు. మీ విజ్ఞత ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలున్నాయి. మంగళవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. పట్టుదలతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ఆదాయానికి తగ్గటుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తపనులు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మీ పొరపాట్లు సరిదిద్దుకోవటానికి యత్నించండి. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఆకస్మిక ప్రయాణం కలిసివస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. శనివారం నాడు మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు పూర్తవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధువులతో తరచు సంభాషిస్తుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విద్యార్థులకు ఏకాగ్రత లోపం, ఆందోళన. వ్యాపారపరంగా మంచి ఫలితాలున్నాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను పూర్తి చేయగల్గుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మనోధైర్యంతో అడుగులేస్తారు. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియచేయండి. సోమవారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అభిష్టం నెరవేరుతుంది. పట్టుదలతో శ్రమించి సత్ఫలితాలు పొందుతారు. అసాధ్యమనుకున్న పనులు సునాయసంగా పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఆదాయం బాగుంటుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, కీలక పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండండి. మీ అతిచొరవ ఇబ్బందులకు దారితీస్తుంది. గృహనిర్మాణాలు చురుకుగా సాగుతాయి. ఒక విషయం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆపత్సమయంలో ఆత్మీయులు సాయం అందిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వేడుకకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

లేటెస్ట్

20-02-2025 గురువారం దినఫలితాలు- ఆలోచనలు నిలకడగా ఉండవు

చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. యోగనరసింహ అవతారంలో?

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments