Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

రామన్
ఆదివారం, 31 ఆగస్టు 2025 (07:48 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. అవకాశాలు చేజారిపోయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సామరస్యంగా మెలగండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానం యత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దైవకార్యం, విందులకు హాజరవుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. కొన్ని పనులు ఆకస్మికంగా పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఎవరినీ నిందించవద్దు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయులకు శుభయోగం. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు సదావకాశాలు లభిస్తాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మొండి బాకీలు వసూలవుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. బుధవారం నాడు అందరితోనూ మితంగా సంభాషించండి. సంతానం దూకుడు కట్టడి చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఎదురుచూస్తున్న వస్తువులు అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. మీ కృషికి పరిస్థితులు అనుకూలిస్తాయి. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఇతరులకు బాధ్యతలు అప్పగించి అవస్థపడతారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఆదివారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. సామరస్యంగా సమస్య పరిష్కరించుకోండి. ఆత్మీయుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. అవివాహితులు శుభవార్త వింటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు పాల్పడవద్దు. ఉపాధ్యాయులకు పదోన్నతి, పురస్కారయోగం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఒంటెద్దు పోకడ తగదు. నిపుణులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ప్రతి విషయం అయిన వారికి తెలియజేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. సోమ, మంగళవారాల్లో చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. అవకాశాలు చేతిదాకా వచ్చి జారిపోతాయి. పెద్దల హితవు ఉత్సాహపరుస్తుంది. మనోబలంతో యత్నాలు సాగిస్తారు. అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మికతపై దృష్టి పెడతారు. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టకాలం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. సంకల్పబలంతో శ్రమిస్తారు. అదృష్టయోగం ఉంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకం. గురువారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. దైవకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. నూతన పరిచయాలు మరింత బలపడతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. వృత్తి ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమయానికి అనుకూలంగా మెలగండి. పొగడ్తలకు పొంగిపోవద్దు, ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు చురుకుగా సాగుతాయి. శనివారం నాడు ముఖ్యలను కలిసినా ఫలితం ఉండదు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. స్వల్ప అస్వస్థకు గురవుతారు. వైద్యసేవలు తప్పకపోవచ్చు. ఆత్మీయుల రాక ధైర్యాన్నిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, పురస్కారయోగం. నూతన పెట్టుబడులు కలిసిరావు. సన్మాన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. శుక్రవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. సన్నిహితులతో తరచు సంభాషిస్తుంటారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. హోల్‌సేల్ వ్యాపారులకు సమస్యలెదురవుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టకాలం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంతోషకరమైన వార్త వింటారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం చేస్తారు. ఆది, సోమవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. న్యాయవాదులకు ఆదాయాభివృది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహసంచారం సామాన్యంగా ఉంది. ఆచితూచి అడుగేయండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. సాహసకృత్యాలకు పాల్పడవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో యత్నాలు సాగిస్తారు. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తులతో తరుచూ సంభాషిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. వ్యవహారంలో ఆచితూచి అడుగేయండి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయొద్దు. మీ అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. సంకల్పబలంతో ముందుకు సాగండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. శనివారం నాడు ముఖ్యల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో యత్నాలు సాగిస్తారు. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఆరోగ్యం బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. నిపుణులను సంప్రదించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మంగళవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధవహించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్‌తో విసుగు చెంది బైకును మోసుకుంటూ వెళ్ళిన యువకుడు..

Kavitha Like Sharmila: ఏపీలో షర్మిల.. తెలంగాణలో కవిత..? ఏం జరుగబోతోంది?

పీకలదాకా మద్యం సేవించి వచ్చి తరగతి గదిలో నిద్రపోయిన తాగుబోతు టీచర్!

Kavitha: తెలుగు రాజకీయాల్లో విడిపోయిన మరో కుటుంబం.. టీడీపీలోకి కవిత ఎంట్రీ ఇస్తారా?

నోబెల్ పురస్కారానికి సిఫార్సు చేయలేదనే భారత్‌పై ట్రంప్ అక్కసు.. అందుకే సుంకాల పోటు

అన్నీ చూడండి

లేటెస్ట్

Parivartini Ekadashi 2025: పరివర్తని ఏకాదశి ఎప్పుడు.. ఎలా జరుపుకోవాలి.. కృష్ణుడు యుధిష్ఠిరునికి...?

02-09-2025 మంగళవారం ఫలితాలు - ఆరోగ్యం జాగ్రత్త.. అతిగా శ్రమించవద్దు...

Bathukamma: బ్రెజిల్ రియో ​​కార్నివాల్ స్థాయిలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తాం: జూపల్లి

వినాయక చవితి పండుగ తర్వాత గణేష్ విగ్రహాలను నిమజ్జనం ఎందుకు చేస్తారు?

Bhagavad Gita: భగవద్గీత నిత్య సంజీవిని : డా ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments