Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-08-2021 నుంచి 14-08-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (00:53 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. తలచిన కార్యం సిద్ధిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగ సాగుతాయియ ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా వుండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఇసుక కాంట్రాక్టర్లకు ఇబ్బందులెదుర్కుంటారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆర్థికలావాదేవీలతో హడావుడిగా ఉంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు లోటుండదు. పెట్టుబడులకు అనుకూల సమయం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పిల్లల చదువులపై శ్రద్ధ వహించండి. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. సోమ, మంగళవారాల్లో ప్రముఖ సందర్శనం వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరగ్యం నిలకడగా ఉంటుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. బుధవారం నాడు నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆప్తులకు అండగా నిలుస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. గురు, శనివారాల్లో పత్రాలు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి లేక శ్రీవారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. ధార్మిక, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
అనుకూలతలు అంతంత మాత్రమే. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. గుట్టుగా వ్యవహరించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. గృహమార్పు అనివార్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. మంగళ, బుధవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం.
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారదక్షతతో రాణిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యం వున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు 
ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. పెట్టుబడులకు సమయం కాదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం 
మీ కృషి ఫలిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆది, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. లభ్యమవుతాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆహ్వానం అందుకుంటారు. వైద్య, న్యాయ, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ద్విచక్ర వాహనం దూర ప్రయాణం క్షేమం కాదు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెంటాడుతుంది. స్థిమితంగా వుండేందుకు ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. బుధ, గురువారాల్లో ఒక పట్టాన పూర్తి కావు. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల హితవు మీపై సత్ఫ్రభావం చూపుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యా, ఆరోగ్య సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. విదేశీయానానికి యత్నాలు సాగిస్తారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. అన్యమనస్కంగా గడుపుతారు. రోజులు భారంగా గడుస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ధన సమస్యలెదురవుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య అకారణ కలహం. అనునయంగా మెలగండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. అవివాహితుల్లో నిరుత్సాహం నెలకొంటుంది. ఆశావదృక్ఫథంతో మెలగండి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

లేటెస్ట్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

24-11-2014 ఆదివారం వారం ఫలితాలు : కీలక పత్రాలు జాగ్రత్త.. మీ జోక్యం అనివార్యం...

24-11-2004 నుంచి 30-11-2024 వరకు మీ వార ఫలితాలు

23-11-2024 శనివారం ఫలితాలు - శ్రమాధిక్యతతో లక్ష్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments