Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

రామన్
శనివారం, 19 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఖర్చులు సామాన్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆశించిన ఫలితం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమయస్ఫూర్తితో మెలగండి. భేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు సామాస్యం. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త యత్నాలు మెదలెడతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంకల్పబలంలో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నోటీసులు అందుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు అధికం. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అపోహలకు తావివ్వవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పెద్దల సలహా పాటిస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు అధికం,
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతవుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థిక అంచనాలు ఫలించవు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా తీసుకోండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఒక ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత, ధనలాభం ఉన్నాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సమయస్ఫూర్తిగా మెలగండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. ఒత్తిడికి గురికావద్దు. సహనంతో యత్నాలు సాగించండి. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సన్నిహితులు సాయం చేస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

తర్వాతి కథనం
Show comments