Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

Advertiesment
astro3

రామన్

, బుధవారం, 16 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆరోగ్యం జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్య సమావేశంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. అందరితోను మితంగా సంభాషించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ చొరవతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఏ విషయంలోనూ ఒత్తిడికి గురికావద్దు. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. వివాహయత్నం ఫలిస్తుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. వస్త్రప్రాప్తి, వాహన సౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు పురమాయించవద్దు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త, మీ పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు, కృషిప్రధానం. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహించండి. సాయం ఆశించవద్దు. ఓర్పు, స్వయంకృషితోనే కార్యం సాధ్యమవుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ధృఢసంకల్పంతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. వ్యవహారంలో తొందరపాటుతనం తగదు. విలాసాలకు వ్యయం చేస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదంకాకుండా చూసుకోండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధనం మితంగా ఖర్చుచేయండి. ఆర్భాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. చేపట్టిన పనులపై శ్రద్ధ వహించండి. దంపతులు మధ్య ఆకారణ కలహం. పట్టింపులకు పోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలకపత్రాలు అందుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు వేగవంతమవుతాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఉత్సాహంగా పనులు సాగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం