Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

Advertiesment
astro5

రామన్

, శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవద్దు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహ ఉంటుంది. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అభీష్టం నెరవేరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేయగల్గుతారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఖర్చులు అధికం. అయిన వారితో కాలక్షేపం చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఓర్పుతో మెలగండి. సంకల్పబలంతోనే విజయం సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. కీలక సమావేశంలో పాల్గొంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు త్వరితగతిన సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. శుభకార్యానికి హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అభీష్టం సిద్ధిస్తుంది. ప్రతి విషయంలోను మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేస్తున్న పనులు అర్ధాంతంగా ముగిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అనవసర విషయాల్లో జోక్యం తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. అవకాశాలను దక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. పరిచయస్తులకు సాయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పత్రాలు అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్