Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-05-2021 నుంచి 29-05-2021 వరకూ వార రాశి ఫలితాలు

Webdunia
ఆదివారం, 23 మే 2021 (20:24 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కొంత మొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంప్రదింపులకు అనుకూల సమయం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆది, గురు వారాలలో బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్థిర చరాస్తుల వ్యవహారం కొలిక్కి వస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు బాగుంటుంది. విదేశీయాన యత్నాలు ఫలించవు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంతమాత్రమే. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ కోపతాపాలను అదుపులో వుంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సోమ, మంగళ వారాల్లో ఏ పనీ సాగదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయానికి మించిన ఖర్చులు, రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. బుధవారం నాడు అప్రమత్తంగా వుండాలి. సందేశాలు, ప్రకటనలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులు, కార్మికులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు లోటుండదు. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని రంగాల వారికి అనుకూలమే. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆదాయవ్యయాలకు పొంతన వుండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. పనులు వేగవంతమవుతాయి. శనివారం నాడు విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు లభిస్తుంది. అధికారులకు హోదామార్పు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చేతివృత్తుల కార్మికులకు కష్టకాలం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ సమర్థతకు మరొకరికి కలిసివస్తుంది. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ప్రతికూలతలు నిదానంగా తొలగుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పట్టుదలకు పోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చిరువ్యాపారుకు కష్టకాలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ధనవ్యామోహం తగదు. శుభకార్యానికి హాజరవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనుల్లో శ్రమ అధికం. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. పాతమిత్రులు తారసపడతారు. శుభకార్యానికి హాజరుకాలేరు. బంధుమిత్రుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. అధికారులు కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తులకు పనిభారం. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. షేర్ల క్రయవిక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు
ఈ వారం ప్రతికూలతలు అధికం. నిస్తేజానికి లోనవుతారు. సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. ఆలోచనలనతో సతమతమవుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. బంధుమిత్రుల ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. న్యాయ, సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. కార్మికులు, చేతివృత్తుల వారికి గడ్డుకాలం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక లావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని ఇబ్బందులు నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో మెలకువ వహించండి. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆది, గురువారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మీ శ్రీమతి గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. శుక్ర, శని వారాలలో అప్రమత్తంగా వుండాలి. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం చేజారిపోతుంది. పట్టుదలతో ముందుకు సాగండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు అదుపులో వుండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆది, మంగళ వారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. భవన నిర్మాణ కార్మికులకు కష్టకాలం. చిరువ్యాపారులకు ఆశాజనకం. హోల్ సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులు అధికాల మన్ననలు పొందుతారు. విదేశీ యత్నం ఫలించదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments