Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-05-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు-ఆదిత్య హృదయం చదివినా

Advertiesment
09-05-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు-ఆదిత్య హృదయం చదివినా
, ఆదివారం, 9 మే 2021 (05:00 IST)
ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: అందరితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వుంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీల కోరికలు నెరవేరకపోవడంతో కుటుంబంలో చికాకులు చోటుచేసుకుంటాయి. 
 
వృషభం: ఆర్థికంగా ఎంతో కొంత కలిసివస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు క్రీడలపట్ల అధికమవుతుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత ఆందోళన వంటివి ఎదుర్కొంటారు. కుటుంబీకులతో, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం: ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు అధికమవుతాయి. బంధుమిత్రులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
కర్కాటకం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభినమానం కలుగుతుంది. వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ పెద్దల ఆరోగ్య విషయంలో మెలకువ వహించండి. రావలసిన ధనం వసూలు కోసం అధిక శ్రమను ఎదుర్కొంటారు. 
 
సింహం: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు హడావుడి, తొందరపాటు తగదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
 
కన్య: ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీల మనోవాంఛలు నెరవేరడంతో కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రులను కలుసుకుంటారు. ఏదైనా అమ్మకానికై చేసే ప్రయత్నం వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
 
తుల: సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. సంపాదనకు మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన సమాచారం అందుతుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది.
 
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. స్థిరతచరాస్తులకు సంబంధించిన చర్చలు, వాణిజ్య ఒప్పందాలు సజావుగా పరిష్కారం కాగలవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
ధనస్సు: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వాతావరణంలోని మార్పు రైతులతో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు ఖర్చులు అధికం. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్ట్, ఆటో మొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. 
 
మకరం: కుటుంబ సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత చోటుచేసుకుంటుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ప్రముఖుల కోసం షాపింగ్‌లు చేస్తారు.
 
కుంభం: ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. పెద్దమొత్తంతో ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. దంపతులకు ఏ విషయంలోను పొత్త కుదరదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. 
 
మీనం: భాగస్వామిక వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడటం మంచిది. నిరుద్యోగులకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. నూతన బాధ్యతలను అంగీకరించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-05-2021 శనివారం దినఫలాలు - నారాయణ స్వామి తులసీదళాలతో...