Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-05-2021 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడుని పూజించినా...

Advertiesment
04-05-2021 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడుని పూజించినా...
, మంగళవారం, 4 మే 2021 (04:00 IST)
మేషం : కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హడావుడి వంటివి ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులపై దృష్టిసారిస్తారు. 
 
వృషభం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఇతరుల మందు వ్యక్తి విషయాలు వెల్లడించడం మచిదికాదని గమనించండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. పన్నులు, బీమా, బిల్లులు, పరిష్కారం అవుతాయి. 
 
మిథునం : దైవ, సేవా కార్యక్రమాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. దూర ప్రయాణాలలో చికాకు తప్పదు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : సన్నిహితులతో కలిసి సమావేశాల్లో పాల్గొంటారు. రుణ బాధలు, ఒత్తిడులు, మానసిక ఆందోళన ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు వాయిదాపడతాయి. సోదరీ, సోదరులతో ఏకీభివంచలేకపోతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
సింహం : చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన వాయిదాపడుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అనుకూలం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. 
 
కన్య : వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. స్త్రీలు విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. భాగస్వామిక చర్చలు, కీలకమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టండి. 
 
తుల : ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం. కళా, క్రీడా రంగాల్లో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాసాలు లభిస్తాయి. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. 
 
వృశ్చికం : వృత్తుల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు. 
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు, దైవ, శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. గృహ మరమ్మతుల్లో ఏకాగ్రత వహించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
మకరం : ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్తమలుపు తిరుగుతాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రముఖుల కలయికసాధ్యంకాదు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల వ్యవహారంలో పునరాలోచన అవసరం. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. 
 
కుంభం : ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల్లో సముచి నిర్ణయం తీసుకుంటారు. శ్రమాధిక్యత, అకాలభోజనం వల్ల అస్వస్థతకు గురవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. కలప, సిమెంట్, ఇసుక రంగాలలో వారికి లాభదాయకం. ఆకస్మిక ఖర్చులు వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. విలాసాలకు, ఆడంబరాలకు బాగా వ్యయం చేస్తారు. 
 
మీనం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. పెద్దమొత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవడం ఉత్తమం. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు అధికం. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షయ తృతీయ రోజున పెరుగన్నం దానం చేస్తే..?