Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-02-2021 నుంచి 06-03-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:37 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధిస్తారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. గురు, శుక్ర వారాల్లో మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధువులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. మీ శ్రీమతి ఆంతర్యం గ్రహించండి. గృహంలో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం వుంటుంది. ఇంటి విషయాలు ఏకరవు పెట్టొద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వేడుకకు హాజరవుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూలదాయకం. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. మంగళ, బుధ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. గృహమార్పు ఫలితం నిదానంగా కలిసివస్తుంది. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఇరు వర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆది, గురు వారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలలో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గృహంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మాటకు అందరూ కట్టుబడి వుంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి వున్నాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది వుండదు, గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వాహన చోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా వుండవు. ఖర్చులు విపరీతం. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడతారు. అవసరాలు అతికష్టమ్మీద నెరవేరుతాయి. ఆదివారం నాడు పనులు సాగవు. ఆత్మస్థైర్యంతో వ్యవహరించండి. ఈ చికాకులు తాత్కాలికమే. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ర్పభావం చూపుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. రిప్రజెంటేటివ్‌లు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. కొత్త సమస్యలెదురవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. సోమ, మంగళ వారల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాల తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగానే వుంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పనివారలతో జాగ్రత్త. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధన సాయం తగదు. బుధ, గురు వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకు అధికం. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమవుతుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. అకౌంట్స్ రంగాల వారికి చికాకులు అధికం. వాహనచోదకులకు సమస్యలెదురవుతాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ము కాదు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు అతికష్టమ్మీద నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. శుక్ర, శని వారాలలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మనస్థిమితం వుండదు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. దుబారా ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. స్వల్ప అశ్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రయాణం వాయిదా పడుతుంది.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం కలిసివచ్చే సమయం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వస్త్ర, పచారి, మందుల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వాహ చోదకులకు దూకుడు తగదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments