Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-02-2021 నుంచి 20-02-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

Advertiesment
14-02-2021 నుంచి 20-02-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (23:09 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సత్కాలం సమీపిస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. పెద్దల ప్రోత్సాహం వుంది. వ్యవహారాల్లో ప్రతికూలతలు తొలగుతాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి. వేడుకకు సన్నాహాలు చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. మంగళ, బుధ వారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతులు అవగాహనకు వస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. దైవ కార్యంలో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆప్తుల వివాహ సమాచారం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహ మరమ్మతులు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ద్విచక్ర వాహనచోదకులకు దూకుడు తగదు.
 
మిధునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బంధుమిత్రుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. శనివారం నాడు పనులు సాగవు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు హోదా మార్పు, అదనపు బాధ్యతలు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. కార్మికులకు నిరుత్సాహకరం. ఆస్తి వివాదాలు జఠిలమవుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితుల అనుకూలత అంతంతమాత్రమే. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. సన్నిహితుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. సోమ, మంగళ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయం సంతృప్తికరం. పొదపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ ప్రేమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు పనిభార, విశ్రాంతి లోపం. క్రీడా పోటీల్లో జయం సాధిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వివాహ యత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహం సందడిగా వుంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనుల సానుకూతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉపాధ్యాయలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారలుక హోదా మార్పు, స్థాన చలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక వ్యారాలు కలిసివస్తాయి. పుణ్య క్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలున్నాయి. మీ కష్టం వృధా కాదు. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో సంబంధాలు బలపుడతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులు, చేతివృత్తులవారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. బెట్టింగుల జోలికి పోవద్దు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. గృహం సందడిగా వుంటుంది. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. శుక్ర, శని వారాల్లో విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం కదలికలపైన దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. వివాహ యత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయం లేనివారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సన్నిహితుల సలహా పాటించండి. వేడుకకు హాజరవుతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి రూపొందించిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం ప్రతికూలతలు అధికం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మీ వైఖరిని ఎదుటివారు తప్పుపడతారు. ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా మెలగండి. సంతానం చదువులపైన శ్రద్ధ వహిస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్ లకు కొత్త సమస్యలెదురవుతాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వాహనం ఇతరులకివ్వవద్దు. వేడుకకు హాజరవుతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. గురు, శుక్ర వారాల్లో పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. త్వరలో శుభవార్త వింటారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. అయినవారితో సంభాషిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికి శుభదాయకమే. వివాహ యత్నం ఫలిస్తుంది. కళ్యాణ మంటపాలు అన్వేషిస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. పనులు చురుకుగా సాగుతాయి. శనివారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆప్తుల సలహా పాటించండి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపైన శ్రద్ధ వహిస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. పాత పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. అధికారులకు హోదా మార్పు, ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. వృత్తి, ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడాదిన్నరలో చెన్నైలో అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం: టీటీడీ చైర్మన్