Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-02-2021 - గురువారం మీ రాశి ఫలితాలు- సాయిబాబాను?

Advertiesment
Daily Horoscope
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (05:00 IST)
సాయిబాబాను ఆరాధించినట్లైతే సర్వదా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: ఆదాయ వ్యయాలు ఫర్వాలేదు. ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల ప్రమోషన్, ట్రాన్‌ఫర్‌లకు మార్గం సుగమం అవుతుంది. దంపతుల మధ్య అపోహలు, చికాకులు తొలగిపోగలవు. సంతానం విద్యా విషయాలపై శ్రద్ధ వహిస్తారు. రుణాలు తీర్చి తాకట్టు విడిపించుకుంటారు.
 
వృషభం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటో మొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మాటపడక తప్పదు. 
 
మిథునం: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికమవుతాయి. దైనందిన కార్యక్రమాలు అన్నీ సకాలంలో పూర్తవుతాయి. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకోగలుగుతారు. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. వృత్తిపరంగా ప్రజా సంబంధాలు బలపడతాయి.
 
కర్కాటకం: వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. నూతన ప్రయాణాల్లో నూతన పరిచయాలేర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
సింహం: వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. స్త్రీల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశాజనకం. రావలసిన ధనం కొంత మొత్తమైనా చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి.
 
కన్య: చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. మీ గౌరవానికి భంగం కలిగించే సూచనలున్నాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా వుండాలి. రాబోయే ఖర్చులకు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రైవేట్ సంస్థల్లో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. 
 
తుల: ఉద్యోగస్తులు వాహనం, ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు కొంత శ్రమ అవసరం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత చికాకులు అధికమవుతాయి. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సహాయ సహకారాలు అర్ధిస్తారు.
 
వృశ్చికం: సహోద్యోగులతో సమావేశాలు ఫలించకపోవచ్చు. పాత బిల్లులు చెల్లిస్తారు. కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. ఉద్యోగ యత్నాల్లో ముందడుగు వేయడం చాలా మంచిది. విరోధులు వేసే పథకాలు ఆందోళన కలిగిస్తాయి. ప్రముఖులతో, పెద్దలతో అభిప్రాయ బేధాలు తలెత్తవచ్చు.
 
ధనస్సు: ఆర్థిక సమస్యలు తీరుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. ప్రత్యర్థులతో రాజీ కుదురుతుంది. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. క్రయ విక్రయాలకు తగిన సమయం కాదు.
 
మకరం: సామూహిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఖర్చులు అధికం. దైవ  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయడం వల్ల ఆందోళన పడక తప్పదు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
కుంభం: ఊహించని వారి నుంచి మీకు ఆహ్వానాలు అందుతాయి. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనలోపం. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. పోటీలు, స్పెక్యులేషన్లలో నష్టం సంభవం. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
మీనం: దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం వుంది. కొంతమంది సూటీపోటీ మాటల వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం దానిమ్మ పత్రాలు, పువ్వులతో వినాయకుడిని అర్చిస్తే..?