Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-02-2021 బుధవారం దినఫలాలు - గణపతిని పూజించినా శుభం

Advertiesment
17-02-2021 బుధవారం దినఫలాలు - గణపతిని పూజించినా శుభం
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (04:00 IST)
మేషం : ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఓర్పు, నేర్పుకు ఇది పరీక్షా సమయం. దైవ, పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. 
 
వృషభం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. 
 
మిథునం : పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణదాతలను సంతృప్తిపరుస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : వ్యాపార, ఆర్థిక రహస్యాలు గోప్యంగా ఉంచండి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ద వహిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
 
సింహం : ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. మీ ఉన్నతిని చాటుకోవానికి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. స్త్రీలు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దంపతుల మధ్య చిన్నచిన్న అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. 
 
కన్య : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. మీ ప్రమేయం లేకున్నా కొన్ని విషయాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. స్త్రీలకు స్వీయ అర్జన, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు సంతృప్తికానవస్తుంది. 
 
తుల : ఉద్యోగస్తులకు చేసే పనిలో మార్పు, ఆందోళన కలిగిస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. స్త్రీలు కళ్లు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. వృత్తిపరంగా ప్రజా సంబంధాలు బలపడతాయి. 
 
వృశ్చికం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. కిరాణా, ధాన్యం వ్యాపారులకు, స్టాకిస్టులకు మెళకువ అవసరం. బ్యాంకు పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. 
 
ధనస్సు : బంధువులతో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. టీవీ కార్యక్రమాల్లో స్త్రీలు రాణిస్తారు. వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇసుక కాంట్రాక్టర్లకు, వాహన చోదకులకు జరిమానాలు తప్పవు. 
 
మకరం : అకాలభోజనం, శారీరక శ్రమ, మితిమీరిన ఆలోచనలు వల్ల అనారోగ్యానికి గురవుతారు. పాతమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకుని తెలివితేటలతో ముందుకు సాగి జయం పొందండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
కుంభం : ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. బంధువుల రాకతో పనులు, వ్యవహారాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఎటువంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఏకాగ్రతతో వ్యవహరించడం అన్ని విధాలా క్షేమదాయకం. రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. 
 
మీనం : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు. కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రార్థన ఎంతకాలం కొనసాగాలి? దాని పర్యావసానం ఏమిటి !? (video)