Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-05-2004 నుంచి 25-05-2024 వరకు మీ వార రాశిఫలాలు

రామన్
శనివారం, 18 మే 2024 (23:01 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఆలోచనలతో సతమతమవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య చీటికిమాటికి తగవులు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పత్రాల్లో మార్పులు అనుకూలించవు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ వారం గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయండి. భేషజాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా శుభదాయకమే. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. గృహంలో సందడి నెలకొంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు బాధ్యతల మార్పు, ఉపాధ్యాయులకు స్థానచలనం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆది, సోమవారాల్లో చేపట్టిన పనుల్లో తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పత్రాల్లో సవరణలకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్టాకిస్టులు, హోల్‌సేల్ వ్యాపారులకు కష్టసమయం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అవసరమవుతాయి. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. బాధ్యతగా మెలగండి. మీ సమస్యలను ఆప్తులకు తెలియజేయండి. భేషజాలు, పంతాలకు పోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక ఆహ్వనం ఆలోచింపచేస్తుంది. మంగళవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉన్నతాధికారులకు హోదామార్పు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. పెట్టుబడులకు తరుణం కాదు. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. గృహమార్పు కలిసివస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. వేడుకకు హాజరుకాలేరు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. శనివారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. సోమవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. మంగళవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. అపరిచితులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు చురుకుగా సాగుతాయి. బుధ, గురువారాల్లో శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. సంతానం యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. గృహనిర్మాణాలు పూర్తవుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు ఒత్తిడి, అధికం. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శనివారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పన్నుల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. భూ వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

తర్వాతి కథనం
Show comments