Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-04-2024 నుంచి 20-04-2024 వరకు మీ వార రాశిఫలాలు.. శుభసమయం నడుస్తోంది

Advertiesment
weekly horoscope

సెల్వి

, శనివారం, 13 ఏప్రియల్ 2024 (18:45 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అతిగా ఆలోచింపవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. నిరుద్యోగులకు ఏకాగ్రత, ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు నిదానంగా ఆశించిన ఫలితాలిస్తాయి. 
 
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. బుధవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు, నిర్మాణాలు ముగుస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు ఉపకరిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు మీ సమర్ధతపై గురి కుదురుతుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రయాణంలో జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆది, సోమ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం తీరు అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. చిన్న సమస్యను పెద్దది చేసుకోవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతిలోపం. సభలు, కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధితో శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆదివారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. నోటీసులు అందుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. అందరితోను మితంగా సంభాషించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఆదాయం అంతంత మాత్రమే. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతి సలహా ప్రయోజనం కలిగిస్తుంది. గురు, శుక్ర వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సర్వత్రా శుభదాయకమే. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నూతన పెట్టుబడులు ప్రస్తుతం అనుకూలించవు. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారాలు బాగుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు చెల్లించుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు ఓర్పు, లౌక్యం ప్రధానం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతానం ఉన్నత విద్యలపై దృష్టి పెడతారు. ప్రకటనలు, దళారులను నమ్మవద్దు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు కష్టసమయం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. రావలసిన ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. బంధువులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో అనుకూలతలున్నాయి. వృత్తిపరమైన చికాకులను అధిగమిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. పత్రాలు అందుకుంటారు. స్థల వివాదాలు పరిష్కారమవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. మీ జీవితభాగస్వామిలో ఆశించిన మార్పు వస్తుంది. మంగళవారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆప్తులను కలుసుకుంటారు. మీ సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ అంచనాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ప్రోత్సాహకరం. సాఫ్ట్వేర్ రంగ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. 
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శుభసమయం నడుస్తోంది. లక్ష్యాలను సాధిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. తాకట్టులను విడిపించుకుంటారు. శుక్రవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల్లో మార్పుచేర్పులు సానుకూలమవుతాయి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభాలు, అనుభం గడిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా స్థిమిత పడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు మీపై చక్కని ప్రభావం చూపుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. గృహనిర్మాణాలు, మరమ్మతులు పూర్తవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-04-202 శనివారం దినఫలాలు - పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు...