Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Advertiesment
weekly horoscope

రామన్

, శనివారం, 11 మే 2024 (22:54 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ధనమూలక సమస్యలు ఎదుర్కుంటారు. ఆప్తుల సాయంతో అవసరాలు తీరుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. సంతానం విజయం ఉత్తేజాన్నిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆది, సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. పరిస్థితులు త్వరలో మెరుగుపడతాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. పెద్దల సలహా పాటించండి. ఒంటెద్దు పోకడ తగదు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. సంతానం ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఏ సమస్యనైనా ధైర్యం ఎదుర్కుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మంగళవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సన్నిహితులకు అన్ని విషయాలు తెలియజేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి సారిస్తారు. బుధ, గురువారాల్లో వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంస్థల స్ధాపనలకు అనుకూలం. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. న్యాయ, వైద్య వారికి ఆదాయాభివృద్ధి. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చర్చలు ఫలిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. శుక్రవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. గృహనిర్మాణాలు ముగింపు దశకు చేరుకుంటాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులకు చేరువవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉన్నతాధికారులకు స్థానచలనం. ప్రయాణం తలపెడతారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య తరచు కలహాలు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. గురు, శుక్రవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలమే. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాపారాలు పురోగతిన సాగుతాయి. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు. విదేశీ పర్యటనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం బాగుంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. సోమవారం నాడు పనులు సాగవు. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్‌ప్రభావం చూపుతాయి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. వాక్చాతుర్యంతో రాణిస్తారు. మీ సామర్థ్యంపై ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. సాహసించి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ పట్టుదలే మీ విజయానికి దోహదపడుతుంది. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఆదివారం నాడు శ్రమాధిక్యత, అకాల భోజనం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. కార్మికులకు పనులు లభిస్తాయి. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
అన్నింటా మీదే పైచేయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, జాప్యం. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహనిర్మాణాలు పూర్తవుతాయి. దంపతులకు సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. సామాజిక, పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...