Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-10-2021 ఆదివారం దినఫలాలు - లక్ష్మీనారాయణస్వామిని సర్వదా శుభం....

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (04:00 IST)
మేషం :- మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
వృషభం :- వైద్యులకు విశ్రాంతి లభిస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు.
 
మిధునం :- ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మిత్రుల రాక పోకలు ఆనందం కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- నిరుద్యోగులకు బోగన్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. రుణ యత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు.
 
సింహం :- ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానవస్తుంది. 
 
కన్య :- సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. వ్యాపారవర్గాల వారిమాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెవవేరుతాయి. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం.
 
తుల :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. రావలసినధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
వృశ్చికం :- హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. శతృవులపై విజయం సాధిస్తారు. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలు ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు.
 
ధనస్సు :- స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదుటపడతారు. కానివేళలో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
మకరం :- రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. స్త్రీలకు కొత్త పరిచయాల వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం :- అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలు ఆత్మీయులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. 
 
మీనం: - కోళ్ళ, మత్స్య పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఆత్మీయుల రాక సంతోషపరుస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

వెర్రిమొర్రి పిందెల్లారా, అతి భారీ వర్షం కురిస్తే అమరావతి మాత్రమే కాదు, ముంబై, హైదరాబాద్ కూడా జలమయం (video)

జార్ఖండ్‌లో భీకర ఎన్‌కౌంటర్‌- ఒక మావోయిస్టు మృతి

నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

తర్వాతి కథనం
Show comments