Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29-10-2021 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం

29-10-2021 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం
, శుక్రవారం, 29 అక్టోబరు 2021 (04:00 IST)
మేషం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. కోర్టు వ్యావహారాలలో ఫ్లీడర్లు చికాకులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది. రవాణా రంగంలో వారు చికాకులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- విదేశాలు వెళ్ళటానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలం. దైవ సేవా రంగాల్లో మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశ నెరవేరదు.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. మీ అభిరుచి ఆశయాలకు తగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలు బంధువుల కోసం షాపింగ్ చేస్తారు. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
సింహం :- స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. వృత్తుల్లో వారికి టెక్నికల్ రంగాల్లో వారికి అధిక ఒత్తిడి, చికాకు తప్పదు. విద్యార్థులకు దుందుడుకుతనం అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేయునపుడు పునరాలోచన చాలా అవసరం.
 
కన్య :- ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాలలో మెలకువ అవసరం. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, రుణప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
తుల :- కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. 
 
వృశ్చికం :- విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. బంధువులలో మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. కళా రంగాలపట్ల ఆసక్తి అధికముగా ఉంటుంది.
 
ధనస్సు : - రాజకీయనాయకులకు ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులకు లోనవుతారు. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. పై అధికారులు, ప్రముఖలతో వాగ్వివాదాలకు దిగకండి. దాన ధర్మాలు చేయడంవల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం :- ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. విద్యార్థులు స్వయంకృషితో రాణిస్తారు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు. మీడియా రంగాల వారికి పనిభారం అధికం. 
 
కుంభం :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు తప్పవు.
 
మీనం :- ధనం బాగా అందుట వలన ఏ కొంతైనా నిల్వచేయగలుగుతారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-10-2021 గురువారం దినఫలాలు - కుబేరుడిని ఆరాధించిన శుభం