Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-10-2021 శనివారం దినఫలాలు - వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (04:00 IST)
మేషం :- ఆశాభావంతో ఉద్యోగ యత్నం సాగించండి. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు, వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. 
 
వృషభం :- బ్యాంకు పనులు, కార్యకలాపాలు మందకొడిగాసాగుతాయి. వ్యాపార వర్గాలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిమ్ములను కలవరపరిచిన సంఘటనతేలికగా సమసిపోతుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. 
 
మిధునం :- ట్రాన్సర్లు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. బంధు మిత్రులముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
కర్కాటకం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. చిన్నారులకు బహుమతులు అందిస్తారు. 
 
సింహం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. 
 
కన్య :- గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. బంధువులరాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. కళాకారులకు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి.
 
తుల :- ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది. స్త్రీలు షాపింగ్ కోసం ధనం ఖర్చుచేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అలవాట్లు, మాటతీరు మార్చుకోవటం మంచిది. 
 
వృశ్చికం :- ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీలకు టీవీ చానెళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూరప్రాంతం నుంచి మీ సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. 
 
ధనస్సు :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. రావలసిన ధనం ఆలస్యంగా అందటం వల్ల ఒడిదుడుకులు తప్పవు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మకరం :- ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో పరిచయాలేర్పడతాయి. లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్పలు పరిష్కారమవుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
కుంభం :- కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది.
 
మీనం :- బంధువుల రాకవల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. రవాణా రంగంలో వారికి సంతృప్తి. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments