Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-03-2022 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీ గణపతిని పూజించినా మీకు శుభం...

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు.
 
వృషభం :- మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. విజయాలు తేలికగా సొంతమవుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జప్తికి వస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది.
 
మిథునం :- కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కిరణా, ఫాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. మొండి బాకీలు సైతం వసూలుకాగలవు.
 
కర్కాటకం :- రాజకీయ నాయకులు సభా, సమావేశాలలో పాల్గొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుంచో మీరు కంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడనుంది. స్థిరాస్తి అమ్మటానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహరాలు సమర్థంగా నిర్వహిస్తారు. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. సొంతంగాగాని, భాగస్వామ్యంగాగాని చేసిన వ్యాపారాలు కలిసివచ్చును. దైవ, సేవా కార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
కన్య :- ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. కిరణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి కానరాదు. ఖర్చులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెస్టర్ రంగాల వారికి పురోభివృద్ధి. దైవ దర్శనాలు తేలికగా అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
తుల :- తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసి పోగలవు. మీ సంతానం వివాహ విషయాలపట్ల శ్రద్ధ వహిస్తారు. సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల యిబ్బందులు ఎదుర్కోక తప్పదు.
 
వృశ్చికం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల రాక వల్ల గృహంలో ఖర్చులు అధికమవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశం చేజార్చుకోవడం మంచిది కాదని గమనించండి.
 
ధనస్సు :- భాగస్వామి వ్యాపారాల నుంచి విడిపోవటం అన్ని విధాలా ఉత్తమం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. దైవ, పుణ్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
మకరం :- బంధు మిత్రులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనుకున్న వ్యక్తుల కలయిక అనుకూలించకపోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో సదావకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవవహారాల్లో ఏకాగ్రత వహించండి.
 
కుంభం :- కార్యసాధనలో బాగా శ్రమించాల్సి ఉంటుంది. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసి వస్తుంది. మిత్రులతో కలసి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
 
మీనం :- ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. చేతి వృత్తి, వ్యాపారులకు వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఖర్చులు అంతగా లేకున్నా ధనం వ్యయం విషయంలో మెళుకువ అవసరం. బంధువుల రాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments