Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-01-2022 ఆదివారం రాశిఫలితాలు - సూర్యనారాయణ పారాయణ చేసినా...

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాభివృద్ధికై చేయుకృషిలో సఫలీ కృతులవుతారు. నిరుద్యోగులకు ఆశాజనకం. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్ రంగాలల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
వృషభం :- రవాణా రంగాల వారికి మెళుకువ, ఏకాగ్రత అవసరం. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై ప్రయత్నిస్తారు. మీ యత్నాలు, పథకాలు గుట్టుగా సాగించండి. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
మిథునం :- స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో కొత్త అనుభూతికి లోనవుతారు. షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రముఖుల కలయిక ప్రయోజనకంగా ఉంటుంది.
 
కర్కాటకు :- మీ శ్రీమతి సలహా తీసుకోవటం ఉత్తమం. అందరితో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు తొలగిపోతాయి. ముందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయనాయకులకు దూరప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
సింహం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కన్య :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బెట్టింగులు, జూదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మికంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోను స్త్రీలదే పై చేయిగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యతనెలకొంటుంది.
 
తుల :- స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. ఆలయ సందర్శనాలలో హడావుడి, తొందరపాటు తగదు. మీ ఉత్సాహాని అదుపులో ఉంచు కోవటం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబీకుల కోసం ధనం విరివిగా వెచ్చిస్తారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారస్తులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. రాజకీయాల వారు కార్యకర్తల వల్లసమస్యలను ఎదుర్కొనక తప్పదు. వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం.
 
ధనస్సు :- అందరి సహాయ, సహకారాలు అందుకుంటూ ప్రశాంతంగా గడుపుతారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీరే సమీక్షించుకోవటం ఉత్తమం. ప్రేమికుల తొందరపాటు తనం సమస్యలకు దారితీస్తుంది. రావలసిన ధనం రావడంతోపాటు ఖర్చులు కూడా అధికమవుతాయి.
 
మకరం :- ఆర్థిక కార్యకలాపాలు చాలా సమర్థవంతంగా నడుపతారు. ఊహించని చికాకులు తలెత్తి తెలివితో పరిష్కరిస్తారు. వాయిదా పడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. స్త్రీలకు షాపింగ్ పట్ల ఆశక్తి పెరుగుతుంది. గతానుభవంతో లక్ష్యం సాధిస్తారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది.
 
కుంభం :- కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనాన్ని విరివిగా ఖర్చులు చేస్తారు. ఇంట్లోనూ, సంఘంలోనూ మీ మాటకు విలువ ఉండదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
మీనం :- ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కోళ్ల, మత, పాడి పరిశ్రమల వారికి పురోభివృద్ధి ప్రముఖులను కలుసుకుని బహుమతులను అందిస్తారు. జీవతంలో మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం కానరాగలదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూఎస్ ఎన్నికల ఫలితాలు : గూగుల్ ఉద్యోగులకు కీలక సూచనలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : వెలువడుతున్న ఫలితాలు.. దూసుకెళుతున్న ట్రంప్

క్యాంప్ ఆఫీస్ - ఇంటి నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేసిన పవన్...

జగన్‌కు నేను అమ్మనే.. వాడు నాకు కొడుకే.. విజమయ్మ

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసంలో ఛట్ పూజ.. సూర్యునికి ఇలా అర్ఘ్యమిస్తే.. రాగి నాణేలను..?

కార్తీక సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఏంటి ఫలితం?

కార్తీక సోమవారం.. నువ్వులు దానం చేస్తే?

నవంబర్ 04, 2024- త్రిగ్రాహి యోగం.. కన్యారాశికి అదృష్టమే

04-11- 2024 సోమవారం దినఫలితాలు : సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది...

తర్వాతి కథనం
Show comments