Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-11-2021 సోమవారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్యుని పూజించిన సర్వదా..

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (04:00 IST)
మేషం :- ఉపవాసాలు, శ్రమధిక్యత వల్ల స్త్రీలు అస్వస్థతకు లోనవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఫలితాలు సాధిస్తారు. ధనప్రలోభం వల్ల ఉన్నతాధికారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.
 
వృషభం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. ప్రేమికుల తొందరపాటుతనం పెద్దలకు సమస్యగా మారుతుంది. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత చాలా అవసరం. ఇతరులు చేసిన తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి.
 
మిథునం :- స్త్రీలు ఉపవాసం, దైవ కార్యాల్లో హడావుడిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థత, సమయ పాలన అధికారులను ఆకట్టుకుంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు అనుకూలం.
 
కర్కాటకం :- నిరుద్యోగులకు ప్రకటనలు, కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగాలి. కోర్టు పనుల్లో ప్లీడరు గుమస్తాలకు ఒత్తిడి, చికాకులు అధికం. పొడుపు పథకాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. శుభకార్యాల్లో హుందాగా మెలిగి అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులు, సహోద్యోగులకు మరింత చేరువవుతారు.
 
సింహం :- మీ శ్రీమతి విషయంలో దాపరికం మంచిది కాదు. వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కళ, క్రీడ రంగాల వారికి ప్రోత్సాహకరం. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. నిరుద్యోగులకు, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
కన్య :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్తగా మెలగాలి. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా అధికారులను సంతృప్తిపరచటం సమస్యగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం.
 
తుల :- విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. క్యాటరింగ్ పనివారలకు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. అధికారులకు ప్రజాప్రతినిధుల ఒత్తిడి, తరచూ పర్యటనలు చికాకుపరుస్తాయి. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. ప్రింటింగ్ రంగాల వారికి సమర్థులైన పనివారలే కరవవుతారు.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. భాగస్వామికుల తీరు అనుమానం కలిగిస్తుంది. స్త్రీలతో మిత సంభాషణ క్షేమదాయకం. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుభవం గడిస్తారు. పెద్దల ప్రమేయంతో ఆస్తి వివాదాలు, గృహంలో చికాకులు ఒక కొలిక్కి వస్తాయి.
 
ధనస్సు :- మీ అతిథి మర్యాదలు, పెట్టిపోతలు అతిథులను ఆకట్టుకుంటాయి. స్త్రీలకు పనితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీరెంతగానో ఆందోళన చెందిన సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. వ్యవహారాలు, ఒప్పందాల్లో మీ అభిప్రాయలను ఖచ్చితంగా వెల్లడించాలి.
 
మకరం :- పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం, ఉద్యోగ లేఖ అందుతాయి. రాజకీయనాయకులకు ఒక విషయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
 
కుంభం :- స్త్రీలు కాళ్లు, తల, నరాలకి సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. వ్యాపారస్తులకు సమిష్టి కృషి వలన జయం పొందుతారు. పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాలలో వారికి కలిసివచ్చేకాలం. వేళ తప్పి ఆహారం భుజించుట వలన ఆరోగ్యములో చికాకులను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
మీనం :- ఉద్యోగస్తులకు దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించి ఓ సమాచారం కలవరపెడుతుంది. ఆలయ సందర్శనం చేస్తారు. హోదా పెరగడంతో పాటు బాధ్యతలు అధికమవుతాయి. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి, ప్రైవేటు సంస్థల్లో వారికి ఆందోళన తప్పదు. వైద్య సేవలకు అవసరమైన డబ్బు సమకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cloudburst: జమ్మూ కాశ్మీర్‌ జల విషాధం: 45 మంది మృతి, 120 మందికి గాయాలు (video)

ఈసారి పౌరులకు డబుల్ దీపావళి.. జీఎస్టీపై భారీ కోత.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: మోదీ

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ- పాక్‌కు మోదీ వార్నింగ్ (video)

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments