Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-11-2021 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసిదళాలతో...

Advertiesment
20-11-2021 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసిదళాలతో...
, శనివారం, 20 నవంబరు 2021 (04:00 IST)
మేషం :- భక్తి, ఆధాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సొంత వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. సమావేశాలలో మీకు గుర్తింపు, గౌరవం లభిస్తాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
వృషభం :- ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రముఖులను కలుసుకుంటారు. ఒంటెద్దు పోకడ మంచిది కాదని గమనించండి. ప్రతి వ్యవహారంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్త్రీలు ద్విచక్రవాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
మిథునం :- ఎప్పటి నుండో వాయిదా పడుతూవస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. గృహనిర్మాణం, స్థల సేకరణకు అవసరమైన నిధులు చేతికి అందుతాయి. ఖర్చులు నియంత్రించడంలో విఫలమవుతారు.
 
కర్కాటకం :- తరచూ శుభ, దైవకార్యాలు, సభలు, సమావేశాలలో పాల్గొనడం వల్ల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయాలు, కళ, సాంస్కృతిక, ప్రకటనల రంగాల వారు లక్ష్యాలు సాధించడం కష్టం. బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం.
 
సింహం :- స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. అవివాహిత యువకులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. బంధువులను కలుసుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ధ్యేయం కార్యరూపం దాల్చుతుంది. కొంతమంది మీ నుంచి ధనం, ఇతరత్రా సహాయ సహకారాలు అరిస్తారు.
 
కన్య :- విద్యార్ధుల లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. తలపట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా ధైర్యం, పట్టుదలతో శ్రమించి విజయం పొందుతారు. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలు నూతన పరిచయాలు, బంధువర్గంలో సత్సంబంధాలు నెలకొంటాయి. బ్యాంకింగ్ రంగాల వారు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ వహించండి.
 
తుల :- వృత్తి వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు. క్యాటరింగ్ పనివారలకు, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతంకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం క్షేమదాకయం. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన కుదురుతుంది.
 
వృశ్చికం :- చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు, చికాకులు ఎదుర్కుంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాల పైనే మీ ఆలోచనలుంటాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. నూతన పెట్టుబడులు, గృహ మార్పులు, నిర్మాణాలకు అనుకూలం.
 
ధనస్సు :- దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తుల వారికి శ్రమాధిక్యత, ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్థినుల తొందరపాటుతనం వల్ల చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, పనిభారం, అదనపు బాధ్యతలు వంటి చికాకులు తప్పవు.
 
మకరం :- కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. మిమ్ముల్ని ఆందోళనకు గురిచేసిన సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. ఎగుమతి, దిగుమతి రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయదా పడటం మంచిది.
 
కుంభం :- బంధువుల ఆకస్మికరాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయటం శ్రేయస్కరం. అవివాహితులకు శుభదాయకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు.
 
మీనం :- కాంట్రాక్టర్లు నూతన టెండర్లు అతి కష్టం మీద చేజిక్కించుకుంటారు. మీ నమ్మకం వమ్మయ్యే ఆస్కారం ఉంది. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరగలవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు ప్రయత్నించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరికాయ కొట్టాక అందులో పువ్వు కనబడితే ఏమవుతుంది?