Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-11-2021 బుధవారం దినఫలాలు - గణపతిని పూజించినా...

Advertiesment
17-11-2021 బుధవారం దినఫలాలు -  గణపతిని పూజించినా...
, బుధవారం, 17 నవంబరు 2021 (05:00 IST)
శ్రీ ప్లవనామ సం|| కార్తీక శు|| త్రయోదశి ఉ.9.52 అశ్వని రా. 11. 19 రా.వ.7.02 ల 8.45. పదు.11.21ల 12.07. 
 
గణపతిని పూజించినా మీకు శుభం, జయం, చేకూరుతుంది. 
 
మేషం:- మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు.
 
వృషభం:- బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. హోటల్, క్యాటరింగ్ పనివాలకు పురోభివృద్ధి, ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు చురుకుదనం కానవస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
మిధునం:- అకాల భోజనం, శ్రమాధికవల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపంవల్ల ఆందోళన అధికమవుతుంది. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసివస్తుంది. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి.
 
కర్కాటకం:- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రభుత్వ సంస్థలలో పనులు మందకొడిగా సాగుతాయి. సిమెంటు, కలప, బరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి అధికం.
 
సింహం:- విదేశీ ప్రయాణాలకై చేయు యత్నాలలో సఫలీకృతులౌతారు. వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వూలలో ఓర్పు, నేర్పు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మెలకువ వహించండి.
 
కన్య - ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. ఇంజనీరింగ్, ఆడిట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో భంగపాటు తప్పదు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
తుల:- దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. వస్త్ర, బంగారం, వెండి, లోహ, వ్యాపారులకు శుభదాయకం. ఖర్చులు ఎదురుకావటంతో రుణ యత్నాలు చేస్తారు.
 
వృశ్చికం: - ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ట్రాన్స్ పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పరోభివృది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ హోదా నిలబెట్టుకోవటానికి ధనం బాగా వెచ్చిస్తారు.
 
ధనస్సు: - రాజకీయ నాయకులను ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలు టి.వి కార్య క్రమాలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది.
 
మకరం: - కొబ్బరి, పండు, పూల వ్యవారులు లాభదాయకం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక ఖర్చుకు వినియోగించ వలసివస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి.
 
కుంభం: - ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. స్త్రీలు టి.వి కార్యక్రమాలు, కూర్మకపోటీల్లో రాణిస్తారు. రాజకీయ నాయకులను ప్రయాణాలలో మెళుకువ అవసరం. బ్యాంకు పనుల్లో జాష్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
మీనం:- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తి కావు. హోటల్, క్యాటరింగ్ పని వారలకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-11-2021 మంగళవారం దినఫలాలు - విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి..