Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13-11-2021 శనివారం మీ రాశిఫలాలు : అభయ ఆంజనేయస్వామిని ఆరాధించిన...

13-11-2021 శనివారం మీ రాశిఫలాలు : అభయ ఆంజనేయస్వామిని ఆరాధించిన...
, శనివారం, 13 నవంబరు 2021 (04:00 IST)
మేషం :- దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. మీ సమర్థతను సహోద్యోగులు తమ ప్రతిభగా చాటుకుంటారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. వైద్యరంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో అనుకున్నంత సంతృప్తి కానరాదు. స్త్రీలకు చుట్టు పక్కల వారితో సమస్యలు అధికం అవుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. రిప్రజెంటేటి‌వ్‌లకు, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు.
 
మిధునం :- పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం, త్రిప్పట అధికమవుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలించవు. ప్రతి పని చేతి దాకా వచ్చి వెనక్కి పోవుట వల్ల కాంట్రాక్టర్లకు చికాకు తప్పదు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలన్విగలవు.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ వాహనం లేక విలువైన వస్తువు ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. రుణం ఏ కొంతయినా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది.
 
సింహం :- ఉద్యోగస్తులకు అధికారులతో ఆకస్మిక పర్యటించాల్సివస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. మీ పనులు, కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆత్మీయులు, ప్రముఖులను కలుసుకుంటారు. క్రయ విక్రయాలు సామాన్యం. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య :- చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులు, కార్మికులకు సామాన్యం. రావలసిన ధనం వసూలు విషయంలో ఓర్పు, లౌక్యం ఎంతో అవసరం. మీరు ఆశించే వ్యక్తుల నుండి కావలసిన సమాచారం అందుతుంది. సిమెంటు, బరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.
 
తుల :- ఇంజనీరింగ్, ఆడిట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. స్త్రీలకు పనిలో ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. ప్రభుత్వ అధికారులకు నూతన వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
 
వృశ్చికం :- ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. ఖర్చులు అధికం. రియల్ ఎస్టేట్ రంగాల వారు నూతన వెంచర్లకు సంబంధించిన విషయాలలో పునరాలోచన అవసరం. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధానపరుస్తారు.
 
ధనస్సు :- బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇతరులు చెప్పిన మాటపై దృష్టి పెట్టకండి. ఆరోగ్యం కుదుట పడటంతో ఒకింత ఊరట చెందుతారు. విద్యార్థులలో పట్టుదల, విద్యా విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
మకరం :- వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కుంభం :- దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కానవచ్చిన ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. మీ తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. విద్యార్థునులకు తోటివారి ఆకారణంగా సమస్యలు తలెత్తుతాయి. మీ కళత్రమొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక పౌర్ణమి నదుల వద్ద దీపారాధన చేస్తే...?