Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-12-2021 బుధవారం రాశిఫలాలు : ఒంటరిగా ఏ పని చేయటం క్షేమం కాదు...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒంటరిగా ఏ పని చేయటంక్షేమం కాదని గమనించండి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నడుపుతారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం నుంచిది.
 
మిథునం :- హోల్‌సేల్ వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. మీ భర్తలో ఉన్నట్టుంది వేదాంత ధోరణి కానవస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రస్తుత వ్యాపారాల పైనే శ్రద్ద వహించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. చేపట్టిన పనులలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
సింహం :- వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టులో గలుగుతారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. స్త్రీలు టీ.వీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులసానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి.
 
కన్య :- బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోను మౌనం వహించడం మంచిది. ప్రేమికులకు తొందరపాటు తగదు. బంధువులతో అభిప్రాయభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది.
 
తుల :- గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. ఒక కార్య సాధనకోసం ఒకటికి పది సార్లు ఆలోచించవలసి ఉంటుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ముఖ్యమైన వ్యవహారాలు మీచేతుల మీదుగా సాగుతాయి.
 
వృశ్చికం :- రచయితలు, పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆశక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
ధనస్సు :- స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పంతాలు, పటింపులకు ఇది సమయం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. మీ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. 
 
మకరం :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. భాగస్వామ్యుల మధ్య ఆసక్తి కరమైన విషయాలు చర్చకు వస్తాయి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటారు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.
 
మీనం :- మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. ఇతర వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు

Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి

Telangana tunnel: సొరంగంలో రోబోట్ టెక్నాలజీతో గాలింపు చర్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

09-03-25 నుంచి 15-03-2025 వరకు మీ వార రాశిఫలితాలు

08-03-2025 శనివారం దినఫలితాలు - ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి...

హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం- ఈ రాశులు వారు జాగ్రత్తగా వుండాలి..

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తర్వాతి కథనం
Show comments