మేషం :- దూర ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీలలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణాలు, మరమత్తులు చేపడతారు. ఆపద సమయంలో బంధుమిత్రులు అండగా నిలుస్తారు.
వృషభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. కార్యదీక్షతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా పురోభివృద్ధి కానవస్తుంది.
మిధునం :- సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది. అవివాహితులకు కలిసివచ్చే కాలం. పెద్దల ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన మంచిది. దైవ కార్యాల్లో పొల్గొంటారు. పెద్దల ఆరోగ్యములో మెళుకువఅవసరం.
కర్కాటకం :- ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మీ పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. రుణం తీర్చటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. అజ్ఞాత వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు.
సింహం :- మీ అభిప్రాయాలతో కుటుంబీకులు సానుకూలంగా స్పందిస్తారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు సంతృప్తినిస్తాయి.
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి.
తుల :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసి రాగలదు. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది.
వృశ్చికం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది.
ధనస్సు :- మీ పై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి.
మకరం :- విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికిబదిలీ, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలున్నాయి. మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. దంపతుల మధ్య అపోహలు తొలగి అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
కుంభం :- ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు వాయిదా పడతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం.
మీనం :- కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల అదనపు పనిభారం తప్పదు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.