Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-11-2021 శనివారం మీ రాశిఫలాలు : లక్ష్మీనారాయణస్వామిని ఆరాధించిన...

Advertiesment
27-11-2021 శనివారం మీ రాశిఫలాలు : లక్ష్మీనారాయణస్వామిని ఆరాధించిన...
, శనివారం, 27 నవంబరు 2021 (04:00 IST)
మేషం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. టెక్నికల్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతి నుంచి అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు.
 
వృషభం :- మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. మీ ఆలోచనలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి.
 
మిధునం :- మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి అధికం.
 
కర్కాటకం :- మీ పై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి, సమస్యలు అవే సర్దుకుంటాయి. బిల్లులు చెల్లిస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదా కోరుకోవటం మంచిది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.
 
సింహం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఏ విషయంలోను దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లోను, వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి.
 
కన్య :- నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. స్త్రీలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పరిచయాలేర్పడతాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. మీ ఆంతరంగిక విషయాలు ఇతరుల ముందు ఏకరువు పెట్టటం మంచిది కాదని గమనించండి. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మిత్రుల హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
 
వృశ్చికం :- ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కాంట్రాక్టర్లు, బిల్లర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. రావలసిన ధనం అందటంతో ఆర్థికస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది.
 
ధనస్సు :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. హోటల్, క్యాటరింగ్ పనివారలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలున్నాయి.
 
మకరం :- హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలకు గురికావలసి వస్తుంది. కళాకారులకు, రచయితలకు, అభిమాన బృందాలు అధికం కాగలవు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
మీనం :- దంపతుల మధ్య అపోహలు తొలగి అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరకపోగా ధనం మరింత వ్యయమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-11-2021 శుక్రవారం మీ రాశిఫలాలు : పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు...