Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-12-2021 మంగళవారం రాశిఫలాలు : ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల..

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- ఉద్యోగులకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. విద్యార్థినులకు సహచరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. బంధువుల రాకతో చేపట్టి పనులు వాయిదా పడతాయి. ప్రత్యర్థుల కదలికలను ఓ కంట కనిపెట్టటం మంచిది.
 
వృషభం :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
 
మిథునం :- బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలు దైవసేవా కార్యక్రమాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థునులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
కర్కాటకం :- విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. వృత్తిపరంగా ఎదురైన ఆటాకాలను అధికమిస్తారు. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ ఆంతరంగిక, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి.
 
సింహం :- వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పట్టింపుల వల్ల స్త్రీలు విలువైన అవకాశాలు కోల్పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలు, నూతన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దూర ప్రయాణాలలో మెళుకు అవసరం.
 
కన్య :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ కుటింబీకులతో ఏకీభించలేకపోతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల :- బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయంగా చేస్తారు. ఓర్పు, పట్టుదతలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, బెదిరింపులు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు మీ ఆదాయం మించటంతో ఒకింత ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
వృశ్చికం :- వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం.
 
ధనస్సు :- స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ సంతానం ఉన్నత చదువుల కోసం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమ తప్పవు. చిన్నతరహా పరిశ్రమల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
మకరం :- నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీ తదితర వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. దైవ సేవా కార్యాక్రమాలల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. అదనపు రాబడి దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
కుంభం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఏ వ్యక్తిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి. చేపట్టిన పనులు అతికష్టంమ్మీద అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి.
 
మీనం :- స్త్రీలకు కుటుంబంలోను, చుట్టుపక్కల వారిలోను ఆదరణ లభిస్తుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments