Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-12-2021 ఆదివారం రాశిఫలాలు : సూర్య స్తుతి ఆరాధించిన శుభం...

Advertiesment
12-12-2021 ఆదివారం రాశిఫలాలు : సూర్య స్తుతి ఆరాధించిన శుభం...
, ఆదివారం, 12 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- రాజకీయ, కళా రంగాల్లో వారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
వృషభం :- వస్త్ర, ఆల్కహాలు, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులెదురవుతాయి. మునుముందు ఖర్చులు అధికంగా ఉంటాయి, ధనవ్యయంలో మితం పాటించండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
మిథునం :- ప్రధాన కంపెనీల షేర్ల విలువలు తగ్గే సూచనలున్నాయి. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. వ్యాపార వర్గాలవారికి చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
 
కర్కాటకం :- దంపతుల మధ్య అన్యోన్యత చోటుచేసుకుంటుంది. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. ఆత్మీయుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు.
 
సింహం :- మీ సంతానం పై చదువుల విషయాన్ని వారి ఇష్టానికే వదిలేయటం ఉత్తమం. మీ పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, వ్యవహార జయం పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి, సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
కన్య :- ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. ఉన్నతస్థాయి అధికారులకు స్థానభ్రంశం, హోదా మార్పు వంటి ఫలితాలున్నాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. ఒక స్థిరాస్తి విక్రయంలో సోదరీ సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కుంటారు.
 
తుల :- నిరుద్యోగుల ఉపాధి పథకాలకి మంచి స్పందన లభిస్తుంది. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. స్థల వివాదాలు, ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం :- విందు వినోదాల్లో పాల్గొంటారు. పత్రిక, వార్తా సంస్థలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ సామగ్రి, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొన్ని పనులు అతికష్టంమ్మీద పూర్తి కాగలవు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
ధనస్సు :- నిరుద్యోగులకు ఒక సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. గృహ మార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. బంధు మిత్రులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కుంటారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఖర్చులు అధికమవుతాయి.
 
మకరం :- మీ సంల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. నూతన పరిచయాలు, వ్యాపకాలు కొత్త ఉత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. శారీరక శ్రమ, విశ్రాంతిలోపం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి.
 
కుంభం :- స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో నిరుత్సాహం తప్పదు. విద్యార్థులు లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో శ్రమించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఏ పని తలపెట్టినా మొదటికే వస్తుంది. వార్తా సిబ్బందికి చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వృత్తి, వ్యాపారులకు కలిసిరాగలదు.
 
మీనం :- బంధువుల రాకతో స్త్రీలకు అసౌకర్యం, చికాకులు తప్పవు. రాబడికి మించిన ఖర్చుల వల్ల రుణాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు. విద్యార్థుల్లో ఉన్నత చదువుల పట్ల ఒక అభిప్రాయం నెలకొంటుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. ఒక సమస్య అనుకోకుండా మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో నిద్ర చేస్తే...?