Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-12-2021 సోమవారం రాశిఫలాలు : శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో...

Advertiesment
13-12-2021 సోమవారం రాశిఫలాలు : శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో...
, సోమవారం, 13 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- రాజకీయ నాయకులు సభసమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల తీరు ఒకింత కష్టమనిపిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. ధనాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చుచేస్తారు.
 
వృషభం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవటంవల్ల ఆందోళనకు గురిఅవుతారు. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయటం మంచిది.
 
మిధునం :- విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులకు గురవుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన మార్పులు వాయిదా పడగలవు. బంధువులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. విదేశీయాన యత్నాలలో ఆటంకాలు తొలగిపోగలవు.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. శత్రువులు మిత్రులుగా మారిసహాయం అందిస్తారు. కుటుంబంలోను, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. కోర్టువాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
సింహం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమంచి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కన్య :- రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. అనుభవపూర్వకంగా మీ తప్పిదాలనుసరిదిద్దు కుంటారు. శారీరక శ్రమ, నిద్రలేమితో ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు.
 
తుల :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. రాజకీయనాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వీసా, పాస్‌పోర్ట్ వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది.
 
వృశ్చికం :- స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి చికాకు తప్పదు. వ్యాపార ఒప్పందాలు, స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగుల లక్ష్య సాధనకు నిరంతరకృషి అవసరమని గమనించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
ధనస్సు :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి బరువు బాధ్యతల నుంచి విశ్రాంతి పొందుతారు. శ్రీమతి పేరుతో కొత్త యత్నాలు మొదలు పెడతారు. కాళ్ళు, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు.
 
మకరం :- వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
కుంభం :- శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. ప్రముఖుల పరిచయాలతో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిదికాదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది.
 
మీనం :- బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-12-2021 ఆదివారం రాశిఫలాలు : సూర్య స్తుతి ఆరాధించిన శుభం...