Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

రామన్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. ఖర్చులు అదుపులో ఉండవు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. చేసిన పనులు మొదటికే వస్తాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. ఖర్చులు సామాన్యం.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఖర్చులు సామాన్యం. పనులు ఒకపట్టాన సాగవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధి ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. తీర్థయాత్రకు యత్నాలు సాగిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. రుణ సమస్య పరిష్కారమవుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఒప్పందాల్లో మెళకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగువేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. పనుల్లో ఏకాగ్రత వహించండి. అప్రమత్తంగా మెలగండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. తలపెట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
కార్యాన్ని సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మీ చొరవతో ఒకరికి మంచి జరుతుంది. వేడుకకు హాజరవుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతి విషయంలోను దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

తర్వాతి కథనం
Show comments